ఈటెల రాజేందర్ ను ఓడిస్తాం.. సవాల్ చేసిన కేటీఆర్

ఈటెల రాజేందర్ ను ఓడిస్తాం.. సవాల్ చేసిన కేటీఆర్

ఈటెల రాజేందర్ ను ఓడిస్తాం.. సవాల్ చేసిన కేటీఆర్

పార్టీ నుంచి వెళ్లిపోయిన ఈటెల రాజేందర్ పై మొదటిసారి స్పందించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో మాట్లాడారు కేటీఆర్. ఈటెల రాజేందర్ పార్టీ నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకు చివరి వరకు ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. కేబినెట్ నిర్ణయాలను తప్పుబడుతూ ఉన్నా సహించామని.. ఐదేళ్లుగా కేసీఆర్ తో గ్యాప్ వస్తే.. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. మంత్రిని ఎలా చేస్తారని ప్రశ్నించారు.

సానుభూతి కోసం ప్రజల్లో ఏదేదో మాట్లాడుతున్నారని.. హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్య జరుగుతుందన్నారు. ఆ ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. ఈటెలది ఆత్మ వంచన అని.. ఆయన రాకముందే టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని.. ఆయన వెళ్లిన తర్వాత కూడా బలంగానే ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని.. ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్

తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అధ్యక్షతన మొదలైన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక సమావేశం. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషణ, పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటైజేషన్ ప్రక్రియ, టీఆర్ఎస్ సభ్యుల జీవిత భీమా, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి, పార్టీ ఇతర వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు