నాపై పార్టీలోనే కుట్ర జరుగుతుంది – బీజేపీలో చేరడం బెటర్ – మంత్రి మల్లారెడ్డి

నాపై పార్టీలోనే కుట్ర జరుగుతుంది - బీజేపీలో చేరడం బెటర్ - మంత్రి మల్లారెడ్డి

అధికార పార్టీ ఎమ్మెల్యే.. అందులోనూ మంత్రి.. వేల కోట్ల రూపాయలకు అధినేత.. అలాంటి వ్యక్తిపై అధికార పార్టీ కనుసన్నల్లో.. అధికార పార్టీకి అత్యంత సన్నిహితులకు చెందిన న్యూస్ ఛానల్ లో మాత్రమే వ్యతిరేకంగా వార్తలు రావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. మంత్రి మల్లారెడ్డి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ఓనర్ ను.. డబ్బుల కోసం బెదిరించినట్లు ఆ ఆడియో సారాంశం.

అధికార పార్టీకి చెందిన న్యూస్ ఛానల్ లో.. ఓ మంత్రిపై బ్రేకింగ్ న్యూస్ రావటం.. అందులోనూ ఆ ఒక్క ఛానల్ లోనే ఆ ఆడియో రావటం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా రియల్ ఎస్టేట్ కంపెనీలపై వరస పెట్టి కథనాలు వేస్తున్న టీవీ9 న్యూస్ ఛానల్ లో మాత్రమే మంత్రి మల్లారెడ్డి రియల్ ఎస్టేట్ దందా ఆడియో లీక్ కావటం చూస్తుంటే.. తెర వెనక ఏదో కుట్ర జరుగుతుందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నాయి.

పెద్ద న్యూస్ ఛానళ్లు, పత్రికల వ్యవహార శైలి సహజంగా నిజాన్ని కప్పిపుచ్చటం.. వాస్తవానికి భిన్నంగా కథనాలు రావటం వంటి కామన్. అలాంటిది ఓ అధికార పార్టీకి చెందిన న్యూస్ ఛానల్ లో.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న మల్లారెడ్డిపైనే భూ దందా ఆడియోలు ప్రసారం కావటం చర్చకు దారి తీశాయి.

ఇది పక్కా ప్లాన్ గా చేశారు.. రెండు రోజులుగా జరుగుతున్న కుట్రలో నన్న ఇరికించారు.. ఇది ప్రభుత్వానికి తెలుసు.. అధికార పార్టీ టీఆర్ఎస్ లోని కొందరు కీలక వ్యక్తులకు సైతం ఇది తెలుసు.. అయినా కూడా నన్ను టార్గెట్ చేశారు అంటే.. తెర వెనక ఏదో జరుగుతుంది, గతంలో సైతం కాలేజీలపై ఇదే విధంగా టార్గెట్ చేశారు, ఇవన్ని బరిస్తూ ఉండటం కంటే బీజేపీ లో చేరితే కాస్త గౌరవం అయినా ఉంటుంది అని మంత్రి మల్లారెడ్డి అనుచరులు, ఆప్తుల దగ్గర వ్యాఖ్యలు చేశారంట.

See Also : మంత్రి మల్లారెడ్డి బెదిరిస్తున్నట్టు ప్రముఖ ఛానెల్ వేసిన స్టొరీ ఇదే

See Also : జగన్ బెయిల్ రద్దు పిటీషన్ సరే.. ఎగ్గొట్టిన రూ.273 కోట్లపై విచారణకు రండీ : రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు