వాయిస్ కాల్ తో అడ్డంగా దొరికిపోయిన మంత్రి మల్లారెడ్డి : రియల్ ఎస్టేట్ దందా వెలుగులోకి

మంత్రి మల్లారెడ్డి రియల్ ఎస్టేట్ దందా వెలుగులోకి

మంత్రి మల్లారెడ్డి.. తెలంగాణలో అత్యంత ధనవంతుడైనా ఎమ్మెల్యే, మంత్రి. కాలేజీలు, ఆస్పత్రులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వేల కోట్లు సంపాదించారు. మంత్రి మల్లారెడ్డి ఆధీనంలో 600 ఎకరాల వరకు ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్పారు. హైదరాబాద్ సిటీ శివార్లలో షామీర్ పేట పరిధిలోని బొమ్మరాజుపేటలోని ఓ వెంచర్ ఓనర్ ను బెదిరించిన ఆడియో బయటకు వచ్చింది. అలాంటి మంత్రి మల్లారెడ్డి రియల్ వెంచర్ వేసిన మహిందర్ అనే వ్యక్తికి స్వయంగా ఫోన్ చేసి వాటా ఇవ్వాలని బెదిరించటం సంచలనంగా మారింది. మంత్రి మల్లారెడ్డి ఏమని.. ఎలా బెదిరించారో చూద్దాం..

మంత్రి మల్లారెడ్డి : ఏం మహీందర్.. 50 ఎకరాల వెంచర్ నడుస్తుంది. సర్పంచ్ కు డబ్బులు ఇస్తే సరిపోతుందా.. ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రి ఉన్నాడన్న సంగతి మర్చిపోయావా. కలెక్టర్ కు చెబితే పొట్టుపొట్టుగా తీస్తాడు. ఏమనుకుంటున్నావ్..

వెంచర్ ఓనర్ మహీందర్ : సార్.. సార్.. నేను తీసుకొస్తాను సార్.. మీకు కూడా ఇస్తాను సార్.. కోపం వద్దు సార్..

మంత్రి మల్లారెడ్డి : డబ్బులు ఇచ్చే వరకు వెంచర్ ఆపేయ్. వెంచర్ లో వాటా ఇవ్వకపోతే పద్దతిగా ఉండదు అంటూ ఫోన్ లో వెంచర్ ఓనర్ మహీందర్ కు వార్నింగ్ ఇచ్చాడు మంత్రి మల్లారెడ్డి.

రియల్ ఎస్టేట్ వెంచర్ ఓనర్ ను డబ్బుల కోసం బెదిరించిన మంత్రి మల్లారెడ్డి.. యధావిధిగానే ఆ ఆడియోను ఖండించారు. నా వాయిస్ కాదని రొటీన్ డైలాగ్ చెప్పారు. మిమిక్రీ చేశారంటూ బుచికీ కబుర్లు చెప్పాడు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు