అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే అస్వస్థతకు గురయ్యారు. సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టీకా తీసుకున్నారు ఎమ్మెల్యే, తెల్లారేసరికి తీవ్ర జ్వరం వచ్చినట్లు తెలుస్తుంది. జ్వరం తీవ్రత 102 డిగ్రీలుగా ఉంది. ప్రస్తుతం ఆర్కే ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు. సాయంత్రంవ్ అరకు జ్వరం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా టీకా పంపిణి సమయంలోనే అధికారులు పలు సూచనలు చేశారు. టీకా తీసుకున్న తర్వాత రెండు మూడు రోజులు నీరసంగా ఉంటుందని తెలిపారు. ఎవరు కంగారు పడకూడదని వివరించారు. సాధారణ జ్వరం వచ్చి వెళ్తుందని సూచించారు.

ఇక తానూ త్వరగానే కోలుకుంటానని, పూర్తిగా కోలుకోగానే ప్రజల్లోకి వస్తానని ఎమ్మెల్యే ఆర్కే వివరించారు. మంగళగిరిలో రోజూ 10కిపైగా కొత్త కొవిడ్ కేసులు వస్తుండటం బాధాకరమని, ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అన్నారు. స్వీయ రక్షణ పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ తాజాగా వెలువడిన ఫలితాలు మూడు రాజధానులు మద్దతుగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు మూడు రాజధానులు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు ఆర్కే

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు