ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్.. ఈ విషయం తెలిసిన తర్వాత అసెంబ్లీలో ఆయన పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలు అందరూ షాక్ అయ్యారు. ఓ ఎమ్మెల్యే రెండో సారి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఈ విషయం తెలిసిన తర్వాత అసెంబ్లీలో ఆయన పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలు అందరూ షాక్ అయ్యారు. ఓ ఎమ్మెల్యే రెండో సారి కరోనా బారిన పడటంతో చర్చనీయాంశం అయ్యింది.

అంబటి రాంబాబు కరోనా బారిన పడటం ఇది రెండో సారి. ఇప్పుడు మళ్లీ వైరస్ ఎటాక్ కావటం కలకలం రేపుతోంది. జూలైలో కరోనా వచ్చి తగ్గిన విషయం మీ అందరికీ తెలిసిందే.. నిన్న అసెంబ్లీలో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. రీ ఇన్ఫెక్షన్ కు గురి కావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అవసరం అయితే ఆస్పత్రిలో జాయిన్ అవుతాను.. మీ ఆశీస్సులతో కోవిడ్ ను మరోసారి జయించి మీ ముందుకు వస్తాను అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు