వైసీపీ నేతలను వెంటాడుతున్న కరోనా.. మరో నేతకు పాజిటివ్

వైసీపీ నేతలను వెంటాడుతున్న కరోనా.. మరో నేతకు పాజిటివ్

కరోనా ప్రభావం రోజు రోజుకు తగ్గుతుంది. ఇక ప్రజల్లో కూడా కరోనా భయం చాలా వరకు తగ్గింది. ఇక వైసీపీ నేతలను మాత్రం కరోనా మహమ్మారి వదలడం లేదు. సోమవారం మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని ఈ రోజు ఉదయం నిర్ధారణ అయింది.

దీంతో ఆయన వెంటనే తన స్వగ్రామం నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు నాగేశ్వరరావు.. తమ ఎమ్మెల్యేకు కరోనా రావడంతో నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక వైసీపీ నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు