అలాగే అనుకుందాం.. రోజా వస్తానంటే టీడీపీ తీసుకుంటుందా..

అలాగే అనుకుందాం.. రోజా వస్తానంటే టీడీపీ తీసుకుంటుందా..

అలాగే అనుకుందాం.. రోజా వస్తానంటే టీడీపీ తీసుకుంటుందా..

ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. నగిరి నియోజకవర్గంలో గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయని రోజానే స్వయంగా చెప్పుకొచ్చారు. పార్టీలోని కేజే కుమార్ వర్గం వ్యతిరేకంగా పని చేస్తుందని సీఎం జగన్ దృష్టికి గతంలోనే తీసుకెళ్లారు. ఇప్పుడు లేటెస్ట్ గా రోజాను పొమ్మనలేక పొగపెడుతున్నారంటూ ఓ వర్గం మీడియాలో ఉరుములు, మెరుపులు సృష్టిస్తుంది.

ఇక్కడ విశేషం ఏంటంటే.. నగిరి నియోజకవర్గంలో రోజా వర్సెస్ కేజే కుమార్ మధ్య ఉప్పు – నిప్పు అనే విషయం నియోజకవర్గం మొత్తం తెలుసు. అదును కోసం వెయిట్ చేసిన రోజా.. ఇటీవల జరిగిన పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తన వర్గం వాళ్లను నిలబెట్టి.. క్లీన్ స్వీప్ చేసింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రోజా వర్గం పైచేయి సాధించింది. విజయం తర్వాత పరోక్షంగా కేజే కుమార్ వర్గానికి వార్నింగ్ ఇచ్చింది. తెర వెనక ఎన్ని కుట్రలు చేసినా నన్ను ఏమీ చేయలేరంటూ తొడ కొట్టింది రోజా.

ఆ తర్వాత కేజే కుమార్ వర్గం సైలెంట్ అయ్యింది. మంత్రివర్గం రేసులో ఉన్న రోజా.. ఆ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. సీఎం జగన్ తో నేరుగా మాట్లాడగలిగిన రోజాకు.. సెకండ్ టైం విస్తరణలో మినిస్టరీ గ్యారెంటీ అనే మాట ఇచ్చారంట. ఈ క్రమంలోనే రోజా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడి మరీ తన వర్గం మొత్తాన్ని గెలిపించుకుని.. నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకున్నారు.

ఓ వర్గం మీడియాలో రోజాకు పొమ్మనలేక పొగబెడుతున్నారంటూ వార్తలు రావటం కలకలం రేపింది. ఇక్కడ విషయం ఏంటంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొగ బెడితే.. బయటకు నెట్టేస్తే.. టీడీపీ పార్టీ రోజాను తీసుకుంటుందా అనే డౌట్ వస్తుంది. రోజా అసంతృప్తిగా ఉన్నట్లయితే.. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఆమెను ఆహ్వానిస్తారా.. అలా చేస్తే కార్యకర్తలు ఊరుకుంటారా అనేది చూడాలి.

కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి చంద్రబాబును వ్యక్తిగతంగా.. అవకాశం వచ్చినప్పుడల్లా దుమ్ము దులిపేస్తుంటారు. ఓ రకంగా వీళ్లు రాజకీయంగా కంటే చంద్రబాబు, లోకేష్ ను వ్యక్తిగత వైరంగా మారిందనే చెప్పాలి. టీడీపీలో ఇమడలేకే రోజా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఐరన్ లెగ్ అన్నారు. అయినా రెండోసారి పిలిచి టికెట్ ఇచ్చారు జగన్. మంత్రి రేసులోకి వచ్చారు. మంత్రి పదవి బాగా ఆశిస్తున్నారు రోజా. ఇలాంటి టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక పొగబెడితే.. అలాంటి రోజాను తిరిగి టీడీపీ ఆహ్వానిస్తుందా.. టీడీపీ జాయిన్ చేయించుకుంటుందా అనేది ఇంట్రస్టింగ్ పాయింట్.

ఒకవేళ రోజా వ్యతిరేకంగా టీడీపీ కుట్రలో భాగంగా ఈ వార్తలు సృష్టించినట్లయితే.. నగిరి నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నేత ఎవరున్నారు.. రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్న కేజే కుమార్ టీడీపీలోకి వెళతారా అనేది కూడా ఇక్కడ పాయింట్. ఇందులో భాగంగా రోజాను డ్యామేజ్ చేయటం ద్వారా.. తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారా అనేది చూడాలి. ఎటు చూసినా టీడీపీలో బలమైన నేత అయితే లేరు.. వస్తే గిస్తే వైసీపీ నుంచే టీడీపీలోకి రావాలి అనేది దీంతో స్పష్టం అవుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు