ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు

ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు

2015 జరిగిన ఓటుకు నోటు కేసు విచారణను వేగవంతం చేశారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలోనే కేసులో అభియోగాలు ఎదురుకుంటున్నవారని ఏసీబీ కోర్టు విచారిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనేందుకు డబ్బుకట్టలతో వచ్చి దొరికిపోయారు నాటి తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు. అయితే ఈ కేసులో సండ్ర వీరయ్యకూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక కేసును సోమవారం విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థనను తోసిపుచ్చింది. సండ్ర డిశ్చార్జి పిటిషన్ తో పాటు, ఉదయ్ సింహ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది.

కాగా 2015లో ఈ కేసు సంచలనం సృష్టించింది. నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మెడచుట్టు ఉచ్చు బిగిసింది.. ఫోన్ రికార్డు ఆధారాలు దొరకడంతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది. ఇక ప్రస్తుతం ఈ కేసు విచారణ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే విచారణ వేగవంతం చేసినట్లు సమాచారం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు