చాలా రోజుల తర్వాత అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ

చాలా రోజుల తర్వాత అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ

బీజేపీ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్కే అద్వానీ ఇంటికి ప్రధాని మోడీ వెళ్లారు. ఆదివారం అద్వానీ 94 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటుండటంతో ప్రముఖులు అద్వానీ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోడీ తన సీనియర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ గారితో గడపడం ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు.

“నా వంటి కార్యకర్తలకు అద్వానీ గారి మద్దతు, మార్గదర్శనం ఎల్లప్పుడూ అమూల్యమే. జాతి నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం ఎనలేనిది” అని మోదీ ట్విట్టర్ లో వెల్లడించారు. కాగా, అద్వానీ నివాసానికి వెళ్లిన మోదీ అక్కడ జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

అద్వానీతో కేక్ కట్ చేయించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాట్లాడారు. ఇక బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయసు నియమాన్ని తీసుకురావడంతో అద్వానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు