ఎన్టీఆర్ సమాధి కూల్చరా : ఎంఐఎం – వీళ్లకు మొగుళ్లు బీజేపీ వాళ్లే అంటున్న జనం

పాతబస్తీ ఏమైనా ఎంఐఎం జాగీరా అని నిలదీస్తున్నారు బీజేపీ నేతలు. ఇష్టానుసారం చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి

పేదల ఇళ్లు కూలుస్తాం అంటున్నారు.. మరి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు సమాధులను కూల్చరా అంటూ ప్రశ్నించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. పాతబస్తీలో జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కబ్జాలు చేసినోళ్ల ఇల్లు అన్నీ కూల్చేస్తారంట.. అవి అన్నీ కూడా పేదలవే కదా.. పేదలకు ఇళ్లు ఇవ్వలేని వాళ్లకు కూల్చే హక్కు ఉంటుందా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరేళ్లలో ఎంత మంది పేదలకు ఇళ్లు ఇచ్చింది అని ప్రశ్నిస్తూనే.. పీవీ, ఎన్టీఆర్ సమాధుల అంశాన్ని లేవనెత్తారు. ట్యాంక్ బండ్ పై ఉన్న వాటి సంగతి ఏంటీ అని అడిగారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి బలం వచ్చింది. ఇలా మాట్లాడారు కాబట్టే సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం అని చెప్పాం అంటున్నారు. పాతబస్తీ ఏమైనా ఎంఐఎం జాగీరా అని నిలదీస్తున్నారు బీజేపీ నేతలు. ఇష్టానుసారం చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి కూల్చుతామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని నిలదీస్తున్నారు. వాళ్ల ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకూడదా.. ప్రశ్నించకూడదు.. అదేమైనా ప్రత్యేక దేశమా, రాష్ట్రమా అని అంటున్నారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యలతో బీజేపీ సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్లకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఎంఐఎం నోరు ఇలా మాట్లాడుతుంది కాబట్టే మేం అలా మాట్లాడుతున్నాం అంటున్నారు. వీళ్లకు సరైన మొగుళ్లు బీజేపీ వాళ్లే అంటున్నారు హైదరాబాద్ జనం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు