కట్టలు కట్టలుగా దొరుకుతున్న డబ్బు – హై టెన్షన్ లో హైదరాబాద్

కట్టలు కట్టలుగా దొరుకుతున్న డబ్బు - హై టెన్షన్ లో హైదరాబాద్.. పోటాపోటీగా మద్యం, డబ్బు పంపిణీ జరుగుతుంది. అధికారంలోని టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు నిఘా పెట్టటంతో వారి వ్యవహారం ఎక్కువగా గుట్టు రట్టు అవుతుంది.

money and liquor

మరికొన్ని గంటల్లోనే హైదరాబాద్ లో పోలింగ్ జరగబోతుంది. ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డిన పార్టీలు.. చివరి ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. హైదరాబాద్ లోని అన్ని గల్లీలు, కాలనీల్లో, యూత్ అసోసియేషన్లు, బస్తీల్లో మహిళా సంఘాలతో లోపాయికారీ ఒప్పందాలు జోరుగా సాగుతున్నాయి. కుల సంఘాల పెద్దలతో పంచాయితీలు హీటెక్కిస్తున్నాయి.

ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని బీజేపీ ప్రాథేయపడుతుంటే.. మరొక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని టీఆర్ఎస్ పార్టీ కోరుతోంది.
ఎంత ప్రాథేయపడినా.. ఓటుకు నోటు విలువ మాత్రం మారలేదు.. తగ్గలేదు అని స్పష్టం అయ్యింది.
మహిళా సంఘాలను టార్గెట్ చేసి.. ఒక్క సంఘానికి 6 నుంచి 10 వేల రూపాయలు ముట్టచెబుతున్నాయి పార్టీలు. మైలార్ దేవర్ పల్లిలో ఇలాగే ఒక్కో మహిళా సంఘానికి 6 వేల రూపాయలు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు టీఆర్ఎస్ నేతలు.

మలక్ పేట ఏరియాలో అర్థరాత్రి టీఆర్ఎస్ పార్టీ కరపత్రాల్లో 500 నోటు పెట్టి పంచుతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతని నుంచి లక్షన్నర రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లోనే మకాం వేసిన టీఆర్ఎస్ కీలక నేతలు అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఈఒక్కసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని కోరుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు పోలింగ్ బూత్ ఆధారంగా.. ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ భారీ ఎత్తున డబ్బులు పంచిపెడుతున్నారు.

టీఆర్ఎస్, బీజేపీ అని తేడా లేదు.. ప్రతి కాలనీలో పోటాపోటీగా మద్యం, డబ్బు పంపిణీ జరుగుతుంది.
అధికారంలోని టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు నిఘా పెట్టటంతో వారి వ్యవహారం ఎక్కువగా గుట్టు రట్టు అవుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు