కరోనా చికిత్సలో మరో అద్బుతం.. వరసగా అన్నీ శుభవార్తలే.. ఆక్సీజన్, వెంటిలేటర్లు అవసరం లేకుండానే ట్రీట్ మెంట్

కరోనా చికిత్సలో మరో అద్బుతం.. వరసగా అన్నీ శుభవార్తలే.. ఆక్సీజన్, వెంటిలేటర్లు అవసరం లేకుండానే ట్రీట్ మెంట్

monoclonal antibody therapy
monoclonal antibody therapy

కరోనా చికిత్సలో మరో అద్బుతం.. వరసగా అన్నీ శుభవార్తలే.. ఆక్సీజన్, వెంటిలేటర్లు అవసరం లేకుండానే ట్రీట్ మెంట్

కరోనా మహమ్మారిని అడ్డుకోవటం, అంతం చేయటం అసాధ్యం. ఇలాంటి టైంలో కరోనా వైరస్ బారిన పడిన వారికి ఎలాంటి మందులు ఇవ్వాలి.. ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలి అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సెకండ్ వేవ్ తర్వాత అత్యంత వేగంగా సాగిన పరిశోధనలతో ఇప్పుడిప్పుడే క్లారిటీకి వస్తున్నారు డాక్టర్లు, శాస్త్రవేత్తలు.

నిన్నటికి నిన్న 2D- గ్లూగోజ్ డ్రగ్ ద్వారా కరోనా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందుతుంది.. ఇదే సమయంలో మరో గుడ్ న్యూస్ చెప్పారు ఢిల్లీ డాక్టర్లు. కరోనా బారిన పడిన ఇద్దరు రోగులపై మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ ద్వారా చికిత్స చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఎయిడ్స్, ఎబోలా వైరస్ సోకిన వారికి గతంలో అందించిన చికిత్స. ఇప్పుడు ఇదే తరహా చికిత్సను.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ పేరుతో 36 ఏళ్ల వ్యక్తి.. 80 ఏళ్ల వృద్ధురాలికి అందించారు.

36 ఏళ్ల వ్యక్తి కరోనాతో ఐసీయూలో ఉన్నాడు. వెంటిలేటర్ పై ఉన్నాడు. అతనికి మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స చేయగా 12 గంటల్లోనే కోలుకున్నాడు. వృద్ధురాలు సైతం 12 గంటల్లోనే కోలుకున్నట్లు చెప్పారు ఢిల్లీలోని శ్రీ గంగారాం ఆస్పత్రి సీనియర్ డాక్టర్ పూజ కోస్లా.

36 ఏళ్ల వ్యక్తి అయితే తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, నీరసంతో బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తికి మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ చేయటం ద్వారా 12 గంటల్లోనే కోలుకున్నారని చెప్పారు.

ఈ థెరపీ అనేది కరోనా చికిత్సలో గేమ్ ఛేంజర్ అంటున్నారు డాక్టర్లు. దీన్ని కొనసాగించినట్లయితే ఆస్పత్రుల్లో ఉండాల్సిన అవసరం లేకుండానే రోగులు ఇంటికి వెళ్లిపోవచ్చని.. ఔట్ పేషెంట్ కింద ట్రీట్ మెంట్ ఇవ్వొచ్చు అనేది డాక్టర్ల మాట.

ఓ వైపు 2డీ, మరో వైపు ఆనందయ్య మందు, ఇంకో వైపు యాంటీబాడీ థెరపీ.. చాలమ్మా చాలు.. కరోనా నువ్వు మాయం కావటానికి టైం పట్టేచ్చేమోగానీ.. మా ట్రీట్ మెంట్, మందుల ద్వారా కరోనాను ఖతం చేస్తాం అంటున్నారు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు