వారం రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్న కుమారుడు

వారం రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్న కుమారుడు.. చనిపోయి వారం రోజులు అయ్యి ఉంటుందని.. అప్పటి నుంచి అలాగే ఇంట్లో ఉంటున్నాడని చెబుతున్నారు పోలీసులు. కుమారుడి

తల్లి చనిపోయి వారం రోజులు అయ్యింది.. చుట్టాలు, బంధువులకే కాదు చుట్టుపక్కల వారికి కూడా చెప్పలేదు. అంతేకాదు.. తల్లి బతికే ఉందని.. ఆమె నిద్రపోతుందని భావిస్తున్నాడు ఆ కుమారుడు. రెండు రోజులుగా చుట్టుపక్కల వాళ్లకు దుర్వాసన వస్తుండటంతో.. అసలు విషయం బయటపడింది.

వాలంటీర్ వస్తే మా అమ్మ నిద్రపోతుందని చెప్పి పంపించాడు. పోలీసులు వస్తే.. ఇంట్లోకి వస్తే పీక కోసుకుంటా.. రోకలి బండతో తల బాదుకుని చచ్చిపోతా అంటున్నాడు. బలవంతంగా వెళితే అన్నంత పని చేసేలా ఉన్నాడని పోలీసులు తలపట్టుకున్నారు.

బలవంతంగా తలుపులు తీస్తే.. ఏమైనా చేసుకుంటే మరింత సమస్యగా మారుతుందని భయపడ్డారు పోలీసులు. మా అమ్మ చనిపోలేదు అంటూ వాదిస్తున్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదని.. అపార్ట్ మెంట్ వాసులు చెబుతున్నారు.

ఆమె ఎలా చనిపోయింది.. ఎందుకు చనిపోయింది అనేది నిర్థారణ కాకపోవటంతోపాటు కరోనా ఏమైనా ఉందా అనే అనుమానాలు ఉండటంతో.. ఎవరూ అటు వైపు వెళ్లటానికే భయపడుతున్న అపార్ట్ మెంట్ వాసులు.. ప్లాట్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. పోలీసులే బుజ్జగించి తలుపులు తీయటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో.. తలుపులు బద్దలుకొట్టి వెళ్లి బయటకు తీసుకొచ్చారు.

మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని.. చనిపోయి వారం రోజులు అయ్యి ఉంటుందని.. అప్పటి నుంచి అలాగే ఇంట్లో ఉంటున్నాడని చెబుతున్నారు పోలీసులు. కుమారుడి మానసిక స్థితి బాగోలేకపోవటం.. చుట్టుపక్కల వారితో పెద్దగా ఎప్పుడూ మాట్లాడకపోవటంతో.. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో పెద్దగా తెలిసేది కాదని.. అందుకే ఆలస్యం అయ్యింది అంటున్నారు పోలీసులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు