మోత్కుపల్లికి సీరియస్.. ఐసీయూలో కరోనాకు వెంటిలేటర్ పై చికిత్స..

మోత్కుపల్లికి సీరియస్.. ఐసీయూలో కరోనాకు వెంటిలేటర్ పై చికిత్స..

motkupalli narasimhulu health condition serious
motkupalli narasimhulu health condition serious

మోత్కుపల్లికి సీరియస్.. ఐసీయూలో కరోనాకు వెంటిలేటర్ పై చికిత్స..

మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం క్షీణించింది. కరోనా బారిన పడిన ఆయన.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారు.

ఏప్రిల్ 18వ తేదీ ఆదివారం ఆరోగ్యం మరింత విషమంగా ఉండటంతో.. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. వయస్సుతోపాటు షుగర్ పేషెంట్ కావటం.. కరోనా తీవ్రంగా ఉండటంతో.. ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నా.. సీరియస్ కండీషన్ అంటున్నారు వైద్యులు.

కోలుకోవటానికి బాగా టైం పడుతుందని.. కరోనా వల్ల సైడ్ ఎఫెక్ట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నామని.. వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని.. సహజంగా శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

మోత్కుపల్లి ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తలతో అతని అభిమానులు ఆందోళన చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు