రఘురామకృష్ణంరాజుపై ఎనిమిది కేసులు.. ఏ క్షణమైనా అరెస్ట్.. సీబీఐ దూకుడు.. విదేశాలకు వెళ్లిపోయే ఛాన్స్

రఘురామకృష్ణంరాజుపై ఎనిమిది కేసులు.. ఏ క్షణమైనా అరెస్ట్.. సీబీఐ దూకుడు.. విదేశాలకు వెళ్లిపోయే ఛాన్స్

MP Raghu Rama Krishnam raju arrest any time
MP Raghu Rama Krishnam raju arrest any time

రఘురామకృష్ణంరాజుపై ఎనిమిది కేసులు.. ఏ క్షణమైనా అరెస్ట్.. సీబీఐ దూకుడు.. విదేశాలకు వెళ్లిపోయే ఛాన్స్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అతనే ఊహించని విధంగా.. అతనిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఏడు కేసులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే.. మరో కేసు సీబీఐ పరిధిలో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని కేసుల విషయంలో పోలీసులు ఏ క్షణమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 17వ తేదీ తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న సమాచారం ఆధారంగానే.. ఆయన నియోజకవర్గాన్ని వదిలి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వదిలి.. ఢిల్లీలోని గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు.

ఏపీలో నమోదైన ఏడు కేసుల విషయంలో.. రాష్ట్ర పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన రాష్ట్రం వదిలిపోయారని ఆయనే చెబుతున్నారు. వీటి సంగతి అలా ఉంటే.. కీలకమైన సీబీఐ కేసు రోజురోజుకు సీరియస్ అవుతుంది. వివిధ ప్రాజెక్ట్‌ల కింద రఘురామకృష్ణం రాజు రూ.600 కోట్లు అప్పు తీసుకున్నారు. దీనికితోడు ఇండ్‌-భారత్‌ పవర్‌ లిమిటెడ్‌కు కంపెనీ పేరుతో తీసుకున్న రూ.947 కోట్ల అప్పును ఎగ్గొట్టారు. ఓవరాల్ గా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూట్ల నుంచి ఏకంగా రూ.2 వేల 655 కోట్ల మేర రఘురామకృష్ణంరాజు అప్పు తీసుకున్నారు. వీటిలో 273 కోట్ల రూపాయలను సొంతానికి వాడుకున్నట్లు నిర్థారించిన సీబీఐ.. ఈ కేసులో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

ఏపీలో నమోదైన కేసుల్లో అరెస్ట్ అయితే వెంటనే బెయిల్ రావొచ్చు.. అదే సీబీఐ కేసులో నాన్ బెయిల్ బుల్ వారెంట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీని వదిలి ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం.

గతంలో ఇదే తరహా కేసును పరిశీలిస్తే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ గుర్తుకొస్తున్నారు. వాళ్లు రాత్రికి రాత్రి జంప్ అయ్యారు. ప్రస్తుతం అతనిపై ఉన్న కేసుల సీరియస్ దృష్ట్యా ఏపీలో ఉంటే వెంటనే తప్పించుకోవటానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే.. ఢిల్లీలో ఉంటున్నారని.. ఏపీకి రానని చెబుతున్నారని తెలుస్తోంది. సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంటే మాత్రం.. ఢిల్లీ నుంచే విదేశాలకు జంప్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.

గతంలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలాగే తప్పించుకున్నారు. అదే తరహాలో రఘురామకృష్ణంరాజు ప్లాన్ లో ఉన్నారనేది టాక్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు