గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటీ.. అంబానీ, ఆదానీ ఎందుకు లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు?

గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటీ.. అంబానీ, ఆదానీ ఎందుకు లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు?

గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటీ.. అంబానీ, ఆదానీ ఎందుకు లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు?

గ్రీన్ ఎనర్జీ.. నిన్నా మొన్నటి వరకు కామన్ మాట. ఇప్పుడు అది హాట్ డిస్కషన్ అయిపోయింది. దీనికి కారణం అంబానీనే. గ్రీన్ ఎనర్జీలో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టటానికి ప్రణాళిక రచించటంతో అసలు ఈ గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటీ.. ఎందుకు దీనిపై దృష్టి పెట్టారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆదానీ గ్రూప్ 25 వేల కోట్ల పెట్టుబడి పెడుతుంటే.. ఇప్పుడు అంబానీ అంతకు నాలుగు రెట్లు 75 వేల కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చారు.

అసలు గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటీ?

ప్రకృతి నుంచి తీసుకునే శక్తి ఇది. ఆకు పచ్చ కారకాలుగా ఉండే వాటి నుంచి శక్తిని తీసుకుంటారు కాబట్టి దీన్ని గ్రీన్ ఎనర్జీ అంటారు. దీన్ని ఆరు రకాలుగా చెబుతారు. అవి ఏంటో చూద్దాం..

సోలార్ ఎనర్జీ – సౌర శక్తి :

సూర్యుడి నుంచి తీసుకుంటారు లేదా కాంతి నుంచి శక్తిని ఉత్పత్తి చేయటం. ఇది అందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. అయితే సోలార్ ఎనర్జీ ఫలకాలు, వాటి ఉత్పత్తులు అధిక ధర ఉండటంతో దీన్ని అంతగా ఉపయోగించటం లేదు ప్రజలు. సోలార్ పవర్ వస్తువులు చౌకగా లభించినట్లయితే వినియోగాన్ని భారీగా పెంచొచ్చు.

విండ్ పవర్ – పవన శక్తి :

గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటం. మనం తిరుమల వెళ్లినప్పుడు కొండపై పెద్దగా కనిపిస్తాయి. పెద్ద రెక్కలు ఉండి.. భూమి ఉపరితంపై ఉన్న గాలి ప్రవాహం నుంచి శక్తిని గ్రహిస్తుంది. కొండలు, ఎత్తైన ప్రదేశాల్లో వీటిని ఉపయోగిస్తారు. రాబోయే కాలంలో విండ్ పవర్ తయారీ – సరఫరా పెంచాలని ప్రపంచం మొత్తం నిర్ణయించింది. భారతదేశంలో అయితే 20 శాతం విద్యుత్ ను విండ్ పవర్ ద్వారా తీసుకోవచ్చని అంచనా.

జల శక్తి – నీటి విద్యుత్ :

ప్రపంచవ్యాప్తంగా జల విద్యుత్ ఉత్పత్తి అధికం. నీటి ప్రాజెక్టులు కట్టడం ద్వారా అటు సాగునీరు.. ఇటు విద్యుత్ ఉత్పత్తి రెండింటికీ ఉపయోగంగా ఉంటుందని.. వందేళ్లుగా దీనిపై పెద్ద ఎత్తున చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, నిజాంసాగర్, పోచంపాడు, సింగూర్, పాలేరు జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్ర అవసరాల్లో 70 శాతం వీటి నుంచే వస్తుంది. ఖర్చు చాలా తక్కువ. అయితే వర్షాలు లేనప్పుడు జల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

భూమి పొరల నుంచి శక్తి – భూ ఉష్ణ శక్తి

భూమి పొరల్లో అత్యధికమైన శక్తి ఉంటుంది. ఇది ఖనిజాల రూపంలో.. రేడియోధార్మికత నుంచి ఉద్భవిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నీళ్లను మరిగించినప్పుడు వచ్చే బుడగులు ఉంటాయి కదా.. అందులో ఎంతో శక్తి ఉంటుంది. ఇది సహజంగా భూమి పొరల్లో నిల్వ ఉంటుంది. దీన్ని వెలికి తీయటం ద్వారా కావాల్సినంత శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. ఇప్పటికే ఉత్తర అమెరికాలో ఈ విధానంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. బొగ్గు కంటే 10 రెంట్లు అధికంగా విద్యుత్ ను ఈ విధానంలో తయారు చేస్తోంది అమెరికా. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.

బయో మాస్ – చెత్త నుంచి విద్యుత్

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి. ఇప్పుడిప్పుడే భారతదేశంలో దీన్ని అమల్లోకి తెస్తున్నారు. కూరగాయల మార్కెట్లు, చెత్త డంపింగ్ యార్డుల దగ్గర వీటిని ఏర్పాటు చేయటం ద్వారా చెత్త నిల్వ, భూ కాలుష్యం, నీటి కలుష్యాన్ని అరికట్టటంతోపాటు వేస్ట్ నుంచి విద్యుత్ తీసుకోవటం జరుగుతుంది.

జీవ ఇంధనాలు – కంపోస్ట్, వ్యవసాయ ఉత్పత్తుల వేస్ట్ నుంచి శక్తి

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ లో కలుపుతున్న ఇథనాల్ ఇలా వచ్చిందే. చెరుకు, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వచ్చిన పిప్పి, వేస్ట్ నుంచి ఈ శక్తిని తయారు చేస్తున్నారు. 2010 నుంచి వాహనాలకు ఇంధనంగా బయో డీజిల్ ఉపయోగిస్తున్నారు. వాహనాలు తయారీ సైతం బయో ఇంధనాలకు అనుగుణంగా తయారు అవుతున్నాయి. 2050 నాటికి ప్రపంచ డిమాండ్ లో 25 శాతం అవసరాలను ఇది తీర్చగలదని అంచనా వేస్తున్నారు.

ఈ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెరగటం వల్ల బొగ్గు, చమురు వంటి ఇంధన వనరుల వినియోగం తగ్గి కాలుష్యం రహితంగా ప్రపంచం తయారు అవుతుంది. ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్దీ బొగ్గు, చమురు నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ అనేది ప్రకృతి నుంచి తీసుకునేది కాబట్టి.. భూ మండలం ఉన్నంత వరకు లభిస్తూనే ఉంటాయి. దీనికి కావాల్సిందల్లా.. గ్రీన్ ఎనర్జీ తయారీ పరికరాలపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ఈ గ్రీన్ ఎనర్జీలోనే ఇప్పుడు ముఖేష్ అంబానీ లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టటానికి రెడీ అయ్యారు. ఇప్పటికే దేశంలో కొన్ని చిన్నా చితక కంపెనీలు గ్రీన్ ఎనర్జీలో ఉన్నా.. అంబానీ ఎంట్రీతో మొత్తం సిట్యువేషన్ మారిపోయింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు