తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షురాలుగా నందమూరి సుహాసిని

తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షురాలుగా నందమూరి సుహాసిని

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎల్.రమణ రాజీనామాతో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ అధ్యక్షుడు రాజీనామాతో ఏర్పడిన గ్యాప్ ను పూర్తి చేయటానికి కసరత్తు మొదలుపెట్టారు.

తెలంగాణలో పార్టీని బతికించుకోవాలన్నా.. జాతీయ పార్టీ హోదా నిలబడాలన్నా బలమైన నేత కావాలని భావిస్తున్నారు. బయట వ్యక్తులకు ఇస్తే ఇతర పార్టీలు లాగేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బలమైన వ్యక్తిని నిలబెట్టాలని నిర్ణయించారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుల బాధ్యతను నందమూరి వంశానికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట. ఇందులో భాగంగానే హరికృష్ణ కుమార్తె, గతంలో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నందమూరి సుహాసినికి బాధ్యతలు అప్పగించటంలో భారీగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు కూడా.

నందమూరి ముద్దు బిడ్డకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించటం ద్వారా.. పార్టీలో జోష్ వస్తుందని.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఉన్న బలమైన సొంత సామాజికవర్గం ఓట్లతోపాటు.. తెలంగాణలో బీసీల్లో ఉన్న ఆదరణను తిరిగి సంపాదించుకోవచ్చని అంచనా వేస్తున్నారు చంద్రబాబు.

నందమూరి వంశానికి న్యాయం చేసినట్లు అవుతుంది.. అందులోనూ మహిళ.. యాక్టివ్ గా ఉంటుంది.. కార్యకర్తలతో కలుపుగోలు తనం ఉంది.. అన్నయ్య, తమ్ముడి మద్దతు అనుకోకుండానే లభిస్తుంది.. సొంత పార్టీ కావటంతో ఇతర పార్టీల నుంచి ఎలాంటి ముప్పు ఉండదు.. ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాత నందమూరి సుహాసినికి తెలంగాణ రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టింది.. టీఆర్ఎస్ నుంచి కవిత డామినేషన్ లో ఉన్నారు.. ఇలాంటి టైంలో ఓ మహిళకు పార్టీ బాధ్యతలు అప్పగించటం ద్వారా ప్లస్ తప్పితే మైనస్ ఉండదనే ఉద్దేశంలో ఉన్నారు చంద్రబాబు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు