వారం రోజులు తిరుపతిలో చంద్రబాబు ప్రచారం

వారం రోజులు తిరుపతిలో చంద్రబాబు ప్రచారం

వారం రోజులు తిరుపతిలో చంద్రబాబు ప్రచారం: ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ఫోకస్ చేసిన టీడీపీ.. అందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేసింది. అధికార పార్టీ బలుపు తగ్గించాలని.. తిరుపతి ఎన్నికలో గట్టి పోటీ ఇవ్వటం ద్వారా షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. గెలుపోటముల సంగతిని పక్కనపెట్టి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కార్యకర్తలు, నేతలకు హితబోధ చేసిన అధినేత చంద్రబాబు.. ఆ దిశగా తన ప్రచార కార్యక్రమాన్ని సైతం డిసైడ్ చేశారు.

తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏడు రోజులు ప్రచారం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రచారం ఉండనుంది. రోజుకో నియోజకవర్గం చొప్పున.. ఏడు రోజులు ప్రచారం చేసే విధంగా డిసైజ్ చేసింది పార్టీ. చంద్రబాబు ప్రచారంతో పార్టీకి మంచి ఊపు వస్తుందని.. కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందని భావిస్తుంది పార్టీ.

ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్ నేతలు నామినేషన్ కంటే ముందు నుంచే తిరుపతిలోనే మకాం వేశారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి వ్యూహకర్త, బీహార్ నుంచి వచ్చిన షోటైమ్ కన్సల్టింగ్.. రాబిన్ శర్మ అయితే గత ఏడాది అంటే.. 2020 డిసెంబర్ లోనే తిరుపతిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అప్పటి నుంచి గల్లీ గల్లీలోని క్యాడర్ లో ఉత్సాహం, ఉల్లాసం నింపుతున్నారు. రాబిన్ శర్మ వ్యూహాలతో మంచి జోష్ లో ఉన్న టీడీపీ క్యాడర్.. తిరుపతి లోక్ సభను గెలిచి తీరతాం అనే ధీమాగా ఉంది.

రాబిన్ శర్మ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రచారం ముగిసే ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టే విధంగా ప్లాన్ రెడీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ప్రచారం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీ మాత్రం ముందు జాగ్రత్తగా అధినేత బాబును రంగంలోకి దిగుతుండటం విశేషం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు