17 తర్వాత పార్టీ ఉంటుంది.. అచ్చెన్నాయుడే ఉండడు.. చినబాబు చిందులు

17 తర్వాత పార్టీ ఉంటుంది.. అచ్చెన్నాయుడే ఉండడు.. చినబాబు చిందులు

lokesh vs atchennaidu
lokesh vs atchennaidu

17 తర్వాత పార్టీ ఉంటుంది.. అచ్చెన్నాయుడే ఉండడు.. చినబాబు చిందులు

దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. నేటి తరానికి అనుగుణంగా.. ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకుని.. అందుకు తగ్గట్టుగా ముందుకు వెళుతున్నాను అలాంటిది నన్నే అన్నేసి మాటలు అంటాడా.. 40 ఏళ్లు పార్టీలో ఉండి ఏం పీకాడు అతను.. ఆయన కుటుంబం తప్పితే.. జిల్లాలో పార్టీని బలోపేతం చేశాడా అంటూ అచ్చెన్నాయుడిపై చిందులు వేశారంట నారా లోకేష్..

17వ తేదీతో అందరం ఫ్రీ అయిపోతాం.. ఆ తర్వాత పార్టీ లేదు.. బొక్కా లేదు.. అంతా అయిపోయింది.. లోకేష్ సక్కగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చేది అంటూ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల వీడియో లీక్ కావటంపై లోకేష్ చాలా చాలా సీరియస్ అవుతూ.. పై వ్యాఖ్యలు చేశారంట. ఇంకా ఆయన ఏమన్నారంటే.. సన్నిహితులు.. ఆప్తుల దగ్గర..

అచ్చెన్నాయుడు కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తున్నట్లు ఉన్నారు.. ఇప్పడు ఏపీలో ఉన్నది జగన్ రెడ్డి ప్రభుత్వం.. మా డాడీ.. అచ్చెన్నాయుడు ఇంకా పత్రికలు, టీవీలు నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.. అందుకే పార్టీకి ఓటింగ్ శాతం పెరగటం లేదు.. ఇప్పుడు కాలం మారింది.. అంతా డిజిటల్ యుగం నడుస్తుంది.. ప్రజలు, ఓటర్ల ఆలోచనలు సైతం మారాయి.. అందుకు తగ్గట్టుగానే ముందుకు సాగుతున్నాను.. ప్రస్తుతం పార్టీలోని సీనియర్స్ అందరూ ప్రత్యర్థి కాంగ్రెస్ తో రాజకీయం చేసినట్లు చేస్తున్నారు.. ఇప్పుడు పోరాడుతుంది జగన్ రెడ్డితో అన్న సంగతిని గుర్తించుకోవాలంటూ ఆవేదన.. ఆక్రోశం వ్యక్తం చేశారంట.

పార్టీలో ఏం తప్పు చేశాను.. మారుతున్న కాలంతో మారాలి.. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు మార్చుకుంటూ ముందుకు సాగాలి.. అలాంటి మార్పులకు పునాది వేస్తుంటే.. వీళ్లకు నచ్చటం లేదు.. యువతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే.. వాళ్లను ఎంకరేజ్ చేయకపోతే భవిష్యత్ ఉంటుందా అని ప్రశ్నించారంట. 30 ఏళ్ల క్రితం డాడీ సీఎం అయినప్పుడు ఉన్న వాళ్లే ఇప్పటికీ ఉన్నారు కదా.. అంత అనుభవం ఉన్న వాళ్లు అందరూ కలిసి.. పార్టీకి 23 సీట్లను మాత్రమే ఎందుకు తెచ్చారు.. అందరూ వాళ్లే కదా అంటూ రుసరుసలాడారంట.

17వ తేదీ తర్వాత పార్టీ ఉంటుందా.. అందులో అచ్చెన్నాయుడు ఉంటాడో లేదో చూసుకోమని.. ఏం పిచ్చిపిచ్చిగా ఉందా అంటూ చిందులు తొక్కారంట చినబాబు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు