తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ ఎడారే.. ప్రతిపక్షంగా టీడీపీ వైఖరి ఏంటీ.. లోకేష్ ఉద్యమం చేస్తారా

తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ ఎడారే.. ప్రతిపక్షంగా టీడీపీ వైఖరి ఏంటీ.. లోకేష్ ఉద్యమం చేస్తారా

తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ ఎడారే.. ప్రతిపక్షంగా టీడీపీ వైఖరి ఏంటీ.. లోకేష్ ఉద్యమం చేస్తారా

ఏపీకి ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం.. కృష్ణా నీటిపై తన వైఖరి ఏంటో స్పష్టం చేసింది. ఏపీ జల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యింది. ఇదే క్రమంలో.. కృష్ణా బేసిన్ లో కొత్త ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది తెలంగాణ రాష్ట్రం. కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని స్వయంగా చెప్పటం సంచలనంగా మారింది.

అలంపూర్ దగ్గర జోగులాండ బ్యారేజ్ నిర్మాణం చేపట్టి.. 60 నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోయటానికి ప్రణాళిక రచిస్తోంది. ఇదే సమయంలో పాలమూరు, కల్వకుర్తితోపాటు పులిచింతల నుంచి ఎడమ కాల్వ తవ్వాలని నిర్ణయించింది. అంతే కాకుండా కల్వకుర్తి సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించటంతోపాటు.. సంకేశుల, టెయిల్ పాండ్ దగ్గర రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.

ఇదే జరిగితే శ్రీశైలం ప్రాజెక్టుకు.. అక్కడి నుంచి నాగార్జునసాగర్ కు నీటి సరఫరా గణనీయంగా తగ్గిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టుల వల్ల 100 టీఎంసీలు అదనంగా వాడేసుకుంటోంది. ఇదే జరిగితే వర్షాలు తక్కువగా పడిన సమయంలో.. ఎగువ నుంచి అంటే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీళ్ల రాక తగ్గినప్పుడు ఏపీకి తీవ్ర అన్యాయం జరగనుంది.

పోలవరం పూర్తి అవుతుంది కాబట్టి డెల్టాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ఇదే సమయంలో రాయలసీమకు మరిన్ని నీటి కష్టాలు తప్పవు. ప్రస్తుతం రాయలసీమలోని ప్రాజెక్టుల ద్వారా సాగునీటి స్థరీకరణ చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ కాలువల సామర్థ్యంతోపాటు.. నికర జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు.

ఇప్పుడు ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడున్న సామర్థ్యానికి మించి అదనంగా 100 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుకోవటం ద్వారా కరువు కాలంలో.. వర్షాలు పడని సమయంలో.. కర్ణాటక నుంచి నీళ్లు రాని పక్షంలో రాయలసీమ తీవ్రంగా దెబ్బతిననుంది.

తెలంగాణ ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళుతున్న సీఎం జగన్ పై ఆగ్రహంతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే సమయంలో ఏపీ ప్రతిపక్షం టీడీపీ వైఖరి ఏంటీ అనేది ఆసక్తికరం. నీళ్ల విషయంలో సీఎం జగన్ ను తీరును తప్పుబడితే రాయలసీమకు అన్యాయం చేసినోళ్లు అవుతారు.. తెలంగాణను సమర్థిస్తే ఏపీ రైతుల ఆగ్రహానికి కారణం అవుతారు టీడీపీ లీడర్ లోకేష్.

నీళ్ల విషయంలో టీడీపీ మౌనంగా ఉంటే రైతుల ప్రయోజనాలు పట్టవా అంటారు.. రైతులకు పాజిటివ్ గా మాట్లాడితే సీఎం జగన్ కు సపోర్ట్ చేసినట్లే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వాన్ని సమర్థించినట్లే.. ఇప్పుడు టీడీపీ ముందున్న ఆప్షన్స్ రెండే.. సీఎం జగన్ ను సమర్ధిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పటం లేదా.. తెలంగాణ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ప్రశ్నించటం.. ఎలా స్పందించినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కావటం ఖాయం.. ఇక్కడే లోకేష్ వ్యూహం ఏంటీ.. ఎలా స్పందిస్తారు.. కర్ర విరక్కుండా పాము చావకుండా ఎలా మేనేజ్ చేస్తారనే దానిపైనే అతని సమర్థత ఉంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు