జైలు జైలు అని కలవరిస్తున్న నారా లోకేష్ – ఏమబ్బా అంత కసి కోపం

జైలు, జైలు అని కలవరిస్తున్న నారా లోకేష్ - ఏమబ్బా అంత కసి, కోపం..ట్విట్టర్ లోనే ఇంత కోపం చూపిస్తే.. లోకేష్ బాబు సీఎం అయితే మాత్రం.. మొదటి సంతకం

టీడీపీ యువనేత, మళ్లీ అధికారంలో వస్తే సీఎం పీఠంపై కూర్చునే నారా లోకేష్.. ఇటీవల కాలంలో ట్విట్టర్ కౌంట్ పెంచారు. తెల్లవారుజాము నుంచే మొదలుపెడుతున్నారు. ప్రతి అంశంలో స్పందిస్తూనే.. సీఎం జగన్ ప్రస్తావన లేకుండా మాత్రం ట్విట్ ముగించటం లేదు. కాకపోతే ఒక విషయంలో మాత్రం బాగా కసిగా.. కుతకుతలాడుతున్నాడు నారా లోకేష్.

ట్విట్ ఏదైనా జగన్ జైలుకు వెళతాడు.. మళ్లీ చిప్పకూడు తింటాడు అంటూ పదేపదే ప్రస్తావిస్తున్నారు. జగనన్న జైలు పిలుస్తోంది పథకం అంటూ కొత్త నినాదం ఎత్తుకుని.. జగన్ ను ఎప్పుడెప్పుడు జైల్లో పెడదామా అని తెగ తహతహలాడుతున్నాడు లోకేష్. ఇప్పటికే 16 నెలలు జైలులో ఉండి వచ్చిన జగన్ తోపాటు.. ఈసారి 41 మంది ఎమ్మెల్యేలను కూడా జైల్లో పెడతాను.. అది తొందరలోనే ఉంది.. చిప్పకూడు తినటం ఖాయం అంటూ ఎంతో కసి.. కోపంగా ట్విట్టర్ లో తన ప్రతాపం చూపించాడు లోకేష్ బాబు

ఇళ్ల స్థలాల కొనుగోలు, పంపిణీలో 6 వేల 500 కోట్ల అవినీతి జరిగిందని.. జగన్ తో పాటు 41 మంది ఎమ్మెల్యేలు జైలుకు పోవటం ఖాయం అని జోస్యం చెబుతున్నారు లోకేష్. ట్విట్టర్ లోనే ఇంత కోపం చూపిస్తే.. లోకేష్ బాబు సీఎం అయితే మాత్రం.. మొదటి సంతకం జగన్ అరెస్ట్ పైనే పెట్టేట్టు ఉన్నాడు అంటున్నారు నెటిజన్లు. అధికారంలో లేనప్పుడే కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి జైలులో పెట్టించాం.. ఈసారి అధికారంలోకి వచ్చి లోకేష్ సీఎం అయితే మాత్రం.. తొలి సంతకం జగన్ జైలుకు పంపించే ఫైల్ పైనే చేస్తాడేమో అంటున్నారు నెటిజన్లు.

ఏమైనా లోకేష్ బాగా యాక్టివ్ అయ్యారు.. సీఎం జగన్ ను జైలుకు పంపించే వరకు ఊరుకునేలా లేడు.. ఏమబ్బా అంత కోపం, కసి అంటున్నారు నెటిజన్లు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు