లోకేష్ సన్నబడితే.. పార్టీ లావు అవుతుందా.. ఓ టీడీపీ లీడర్ ఎటకారం..

naralokesh new look

రెండు రోజులుగా సోషల్ మీడియాలో నారా లోకేష్ ఫొటో వైరల్ అవుతుంది. మహానాడు సందర్భంగా మాట్లాడుతూ ఉన్న లోకేష్ ఫిజిక్ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా సన్నబడ్డారు.. మీసాలు పెంచారు.. గెడ్డం పెరిగింది.. కొత్త లుక్ లో కనిపించారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు.. ఇప్పటి ఫొటోలను పోల్చిచూస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అన్న మారాడు.. లోకేష్ న్యూలుక్ అదిరింది అంటూ టీడీపీ సోషల్ మీడియా అదరగొడుతుంది.. అధికారం లేకపోతే కనీసం నాలుగు వేళ్లు కూడా లోకేష్ నోట్లోకి వెళ్లటం లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిపోటి మాటలు అంటోంది.

పార్టీ వైర్షన్ ఎలా ఉన్నా.. ఓ టీడీపీ లీడర్ ఎటకారం మాత్రం మామూలుగా పేలలేదు. కరోనా బాధితులను పరామర్శించటానికి అని ఓ కోవిడ్ సెంటర్ కు వచ్చిన టీడీపీ నేతను.. అక్కడే ఉన్న లోకల్ విలేకరులు ఓ ప్రశ్న వేశారు. లోకేష్ కొత్త లుక్ చూశారా సార్ అని.. దానికి ఆయన నవ్వుతూ.. లోకేష్ సన్నబడితే.. పార్టీ లావు అవుతుందా అంటూ ఎటకారం అడారంట.. ఇలాంటి సమాధానాన్ని ఊహించని లోకల్ జర్నలిస్టులు.. మొదట షాక్ అయినా.. ఆ తర్వాత నవ్వుకున్నారంట..

లోకేష్ సన్నబడటం.. లావెక్కటం అనేది కాదు పాయింట్.. పార్టీ లావు కావాలి.. బలపడాలి అంటూ టీడీపీ నేతలే అంటున్నారంటే.. గ్రౌండ్ లెవల్లో పార్టీ ఏ విధంగా ఉంది.. లీడర్స్ ఉన్నారా లేదా.. కార్యకర్తల అభిప్రాయాలు ఏంటీ అనేది ఇప్పటికీ లోకేష్ తెలుసుకోవటం లేదని ఈ కామెంట్ ద్వారా అర్థం అవుతుందని భావించొచ్చు…

సో.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కావాల్సింది లోకేష్ సన్నబడ్డాడా లేదా అన్నది కాదు.. బక్కచిక్కిన పార్టీకి బలం.. లావు రావాలన్నది నేతలు, కార్యకర్తలు గట్టిగానే గుర్తించారన్నమాట..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు