ఆకలికి తట్టుకోలేక చిప్స్ ప్యాకెట్ దొంగతనం : పదేళ్ల బాలుడిని కొట్టి చంపేశారు

10year old kid killed in karnataka

దేశంలో ఆకలి, దరిద్రం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన సాక్ష్యం.. ఇదే సమయంలో మనుషుల్లోని మానవత్వం ఎంత నీచానికి దిగజారిందో కూడా చెబుతోంది. భారతదేశం మనోహన్నత ఆర్థిక శక్తి.. ఆత్మనిర్భర భారత్ అంటూ ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా.. పేదల ఆకలి కోసం ఉచితంగా బియ్యం, పప్పులు, ఉప్పులు ఇస్తున్నారం.. లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెబుతున్నా.. ఇంకా ఆకలి కేకలు, దరిద్రం తాండవిస్తూనే ఉంది. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా ఉప్పనాషి గ్రామంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.

హవేరి జిల్లా ఉప్పనాషి గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు హరిషయ్య మార్చి 16వ తేదీన.. ఆకలితో ఉండి స్థానికంగా ఉండే ఓ కిరాణా షాపులో చిప్స్ ప్యాకెట్ దొంగతనం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చిప్స్ ప్యాకెట్ ను బాలుడు దొంగతనం చేశాడనే నెపంతో.. షాపు యజమానితోపాటు మరో ముగ్గురు.. ఆ బాలుడిని నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. సుమారు 10 గంటలపాటు బాలుడిని ఇంట్లోని పెరట్లో నిర్బంధించి కాళ్లు, చేతులు, మెడపై కర్రతో కొట్టారు. బాలుడు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆందోళన చెందిన ఆ పేద తల్లిదండ్రులు వెతకటం ప్రారంభించారు. షాపు యజమాని నిర్బంధించిన విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. షాపు యజమాని కాళ్లవేల్లా పడి బాలుడిని ఇంటికి తీసుకొచ్చారు.

అప్పటికే తీవ్రంగా దెబ్బలుతిన్న బాలుడు.. మార్చి 16వ తేదీ రాత్రి తీవ్ర జ్వరం బారిన పడ్డారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జ్వరంతోపాటు మెదడులోని రక్తనాళానాల్లో రక్తం గడ్డకట్టిందని.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. రెండు రోజుల తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి నుంచి వివరాలు సేకరించగా.. కిరణా షాపు నుంచి చిప్స్ ప్యాకెట్ దొంగిలించాననే ఆరోపణలతో.. పవన్ కరిశెట్టర్, బసవన్నెవ కరిశెట్టర్, కుమార్ హవేరి, శివరుద్రప్ప అనేది నలుగురు బాగా కొట్టారని చెప్పాడు. ఇలా వాగ్మూలం ఇచ్చిన కొన్ని గంటల్లోనూ బాలుడు చనిపోయాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

హత్య, నిర్బంధం, వేధింపులతోపాటు బాలుడిపై హింస అనే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కోసం.. పదేళ్ల బాలుడిని కొట్టి చంపటం అంటే మానవత్వం ఉందా.. ఉంటే ఎక్కడ ఉంది అనేది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమానం ఉంటే పేరంట్స్ ను పిలిచి మందలించాలి లేకపోతే ఆ పది రూపాయల కోసం డిమాండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఏమైందీ పదేళ్లు జైలులో ఉండాల్సిన దుస్థితి.. డబ్బు. డబ్బుు.. డబ్బు.. ఈ జబ్బుతోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారయ్యా.. ఆకలితో ఉన్న పిల్లోడికి పది రూపాయల చిప్స్ ప్యాకెట్ ప్రాణం తీయటం అందర్నీ కలిచివేస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు