ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ – 22 మంది కరోనా పేషెంట్లు మృతి దేశంలో ఏం జరుగుతుంది ?

11 patient die because of oxygen leak from tanker

మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ పట్టణంలోని జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ అయ్యి.. 22 మంది పేషెంట్లు చనిపోయారు. ఏప్రిల్ 21వ తేదీ బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

బుధవారం మధ్యాహ్నం ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ ను.. ఆస్పత్రిలోని సిలిండర్లకు సప్లయ్ చేస్తున్న సమయంలో.. పెద్ద ఎత్తున లీక్ అయ్యింది. దీన్ని అరికట్టేందుకు పేషెంట్లకు అందిస్తున్న ఆక్సిజన్ ను కట్ చేశారు సిబ్బంది. ట్యాంకర్ నుంచి సిలిండర్లకు ఆక్సిజన్ సప్లయ్ చేసే ఛానల్ ను ఎంత సేపటికీ సరిదిద్దలేకపోయారు సిబ్బంది. 30 నిమిషాల వరకు ఆక్సిజన్ లీక్ అవుతూనే ఉండటంతో.. 22 మంది పేషెంట్లు చనిపోయారు. ఆ సమయంలో ఆస్పత్రిలో 171 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, టెక్నికల్ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఓ వైపు ఆక్సిజన్ లేకపోవటం చనిపోతున్నారు.. మరో వైపు ఆక్సిజన్ లీక్ వల్ల చనిపోతున్నారు.. దేశంలో ఏం జరుగుతుంది అంటూ ఆందోళనలో ఉన్నారు ప్రజలు.

See also :  దేశంలో కొత్త వ్యాపారం : స్మశానాల వద్ద బారులు తీరిన వ్యాపారులు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు