నమ్మలేని నిజం.. ఆక్సిజన్ పై 12 శాతం జీఎస్టీ.. ప్రాణం కంటే పన్నులే ముఖ్యమా..

నమ్మలేని నిజం.. ఆక్సిజన్ పై 12 శాతం జీఎస్టీ.. ప్రాణం కంటే పన్నులే ముఖ్యమా..

దేశంలో కరోనా కేసులు 3 లక్షల దాటి.. చావులు వేల సంఖ్యలో ప్రతిరోజూ నమోదవుతున్నాయి. కరోనా పేషెంట్లకు అత్యవసరంగా అందించే ఆక్సిజన్ కొరతతోపాటు.. ధరలు అమాంతం పెరిగాయి. గతంలో 600 రూపాయలకు దొరికే ఆక్సిజన్.. ఇప్పుడు 12 వేలకు చేరింది. ధరను అదుపు చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెళ్లినట్లు వ్యవహరిస్తున్నాయి.. అంతే కాదు మరో భయంకరమైన కఠోన.. నమ్మలేని నిజం ఒకటి బయటపడింది.

ఆక్సిజన్ పై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ.. అదేనండీ పన్ను ఎంతో తెలుసా అక్షరాల 12 శాతం.. లక్ష రూపాయల ఆక్సిజన్ ఆర్డర్ చేస్తే 12 వేల రూపాయలు ట్యాక్స్ పడుతుంది. ప్రాణాలను కాపాడే ప్రాణ వాయువుపై ఇంత పన్ను ఏంటీ అని అందరూ ఆశ్చర్యపోవటం కాదు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుంది.. ఇలాంటి టైంలో.. ప్రాణాలను కాపాడే ఆక్సిజన్ ఉచితంగా అందించాల్సిన సమయం ఇది.. అలాంటి దానిపైనే 12 శాతం ట్యాక్స్ వేస్తుండటం.. అది కూడా బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు అమ్ముతుండటం ఎంత వరకు కరెక్ట్. బ్లాక్ మార్కెట్ దందాను నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వమే.. 12 శాతం జీఎస్టీ అంటూ పన్ను విధించటం ఎంత వరకు సమర్ధించుకుందాం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు