డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్.. త్రిపురలో ఊహించని విధంగా కేసులు.. బలాదూర్లు తగ్గించండి

డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్.. త్రిపురలో ఊహించని విధంగా కేసులు.. బలాదూర్లు తగ్గించండి

డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్.. త్రిపురలో ఊహించని విధంగా కేసులు.. బలాదూర్లు తగ్గించండి

కరోనా తగ్గిందని తైతెక్కలు ఆడుతున్నారు జనం. షాపుల్లో రద్దీ.. బార్ల, పబ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బస్సుల్లో, రైళ్లలో సీట్లు దొరకటం లేదు. మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. కరోనా అంతం అయిపోయిందని.. హాయిగా తిరిగేస్తున్నారు. వాస్తవ సిట్యువేషన్ అంత ప్రశాంతంగా ఏమీ లేదు.. చాపకింద నీరులా విస్తరిస్తూ ఉంది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఏ మాత్రం తగ్గలేదని.. మాయం కాలేదని.. కేవలం దాని వేగం మాత్రమే తగ్గిందని స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారత్ లో సెకండ్ వేవ్ అయిపోయిందని చంకలు గుద్దుకుంటున్నారని.. అలాంటి సిట్యువేషన్ ఏమీ లేదని.. జస్ట్ స్లో అయ్యిందని స్పష్టం చేసింది. దీనికి ఆధారాలు చూపెట్టింది. దేశవ్యాప్తంగా 2021, జూలై 9వ తేదీ 42 వేల 766 కొత్త కేసులు నమోదయ్యాయి. వెయ్యి మందికి పైగా చనిపోయారు. డెత్ రేట్ మళ్లీ వెయ్యికి పైగా నమోదు కావటం ఆందోళన కలిగించే అంశమా కాదా అని మీరే తేల్చుకోవాలి.

15 రోజులుగా వెయ్యిలోపు నమోదవుతున్న మరణాలు.. మళ్లీ ఒక్కసారిగా పెరిగి వెయ్యికిపైగా నమోదు కావటం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తోంది.

ఇక కొత్తగా పుట్టిన డెల్టా ప్లస్ వైరస్ దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. చాపకింద నీరులా.. ప్రజలపై దాడి చేస్తోంది. ఇందుకు ఉదాహరణే త్రిపుర రాష్ట్రం. అక్కడ 138 డెల్టా ప్లస్ కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. 151 మంది కరోనా పేషెంట్ల శాంపిల్స్ ను పరీక్షిస్తే.. అందులో 138 మంది శరీరంలో డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ గుర్తించటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో మూడు కేసులు ఆల్పా వేరియంట్ గా బయటపడింది.

త్రిపురకు వచ్చింది మనదాకా రాదనే గ్యారెంటీ ఏమీ లేదు. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి. బలాదూర్లు తగ్గించండి. గతంలోలా ఇంట్లో తిని తొంగోండి.. బతికుంటే బలిసాకు తిని బతికేయొచ్చు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు