పంజాబ్ రైతుల ఆగ్రహంతో.. హైదరాబాద్ లో ఇంటర్నెట్ సమస్యలు

పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో 21 వేల 306 మొబైల్ టవర్స్ ఉండగా.. వీటిలో 15 వందల టవర్లను కూల్చివేశారు. వీటిలో.....

1,500 mobile phone towers having been vandalised in Punjab
1,500 mobile phone towers having been vandalised in Punjab

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పొలాల్లో ఏర్పాటు చేసిన సెల్ టవర్లను కూల్చివేస్తుండటంతో.. దేశంలో ఇంటర్నెట్ ఇష్యూస్ వస్తున్నాయి. రెండు రోజులుగా ఢిల్లీ, నోయిడా కేంద్రంగా పని చేసే సర్వర్లపై ఈ ప్రభావం పడి.. అది హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీని టచ్ చేసింది. సెల్ టవర్లు కూల్చివేతతోపాటు.. నెట్ వర్క్ కేంద్రాలపై దాడులు చేస్తుండటంతో.. సర్వర్లపై భారం పడి డౌన్ అవుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోంలో ఉండి పని చేసుకుంటున్న ఐటీ ఉద్యోగులు.. సర్వీస్ ప్రొవైడర్లపై ఒత్తిడి చేస్తున్నారు. కంప్లయింట్స్ ఇబ్బడిముబ్బడిగా వస్తుండటంతో.. ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు తలనొప్పిగా మారింది.

ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న సర్వర్లను ఉపయోగిస్తున్న హైదరాబాద్ సర్వీస్ ప్రొవైడర్లకు నెట్ వర్క్ ఇష్యూ తలనొప్పిగా మారింది. నెట్ వర్క్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండటం.. సర్వర్లు డౌన్ కావటంతో రెండు రోజులుగా రాత్రీపగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.

ఢిల్లీ సరిహద్దుల్లో 30 రోజులుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా పంజాబ్ రైతులు.. తమ పొలాల్లో ఏర్పాటు చేసి సెల్ టవర్లు, నెట్ వర్క్ కేంద్రాలపై దాడులు చేస్తూ.. కనెక్టివిటీని దెబ్బతీస్తున్నారు. ఇది తీవ్ర సమస్యగా మారింది ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు. ఇప్పటికే ఈ విషయంపై ఢిల్లీలోని రైతు ఉద్యమ నేతలు స్పందించారు. సెల్ టవర్లను కూల్చవద్దని.. వాటి జోలికి వెళ్లొద్దని పిలుపునిచ్చారు.

పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో 21 వేల 306 మొబైల్ టవర్స్ ఉండగా.. వీటిలో 15 వందల టవర్లను కూల్చివేశారు. వీటిలో 433 టవర్లకు మరమ్మతులు చేశారు. ఇంకా వెయ్యికి పైనే టవర్లను పున:రుద్దరించాల్సి ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు