కరోనా వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ తీసుకోవాలి ?

corona vaccine in india

మీకు కరోనా వచ్చి తగ్గిపోయిందా.. జలుబు, దగ్గు, జ్వరం లేదా ఇతర రెగ్యులర్ అనారోగ్య సమస్యలు ఉన్నాయా.. అయితే తొందరపడి కరోనా టీకా తీసుకోవద్దు. వ్యాక్సిన్ వేయించుకోవాలనే ఆరాటం వద్దు అంటున్నారు డాక్టర్లు.

మీకు కరోనా వచ్చి తగ్గింది కదా అని వెంటనే వ్యాక్సిన్ తీసుకోవద్దు.. కనీసం 90 రోజులు ఆగాలి అంటున్నారు డాక్టర్లు. కరోనా చికిత్స సమయంలో మీరు విపరీతంగా మందులు వాడి ఉంటారు.. యాంటీ బయోటిక్స్ తీసుకుని ఉంటారు.. విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుని ఉంటారు.. దాని ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

కరోనా చికిత్స సమయంలో మీరు తీసుకున్న మందుల ప్రభావం పూర్తిగా మీ శరీరం నుంచి వెళ్లిపోయి.. శరీరం సాధారణ స్థితికి రావాలంటే 60 నుంచి 70 రోజుల సమయం పడుతుంది. కొంత మందికి కొంచెం ఆలస్యంగా 90 రోజులు పడుతుంది. ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకున్న డాక్టర్లు.. కరోనా వచ్చి తగ్గిన తర్వాత 90 రోజులకు వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

ఇక జలుబు, దగ్గు, జ్వరం లాంటి సాధారణ అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వ్యాక్సిన్ వేయించుకోవద్దని సలహా ఇస్తున్నారు. అవి తగ్గిన తర్వాత వారం, 10 రోజులు ఆగి వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదని స్పష్టం చేస్తున్నారు వైద్యులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు