తేడా కొట్టిన తోపుల లెక్కలు : ఛానెల్స్ ను బురిడి కొట్టించిన ప్రజలు : తోపు ఛానెల్ అంటే తన్నుడే

all exit polls are wrong

మా పత్రిక తోపు.. మా ఛానల్ నెంబర్.. మేం రాస్తే చదువుతారు.. మేం వేస్తూ చూస్తారు.. వింటారు.. అంటూ డబ్బాలు కొట్టుకునే పత్రికలు, టీవీలు, సర్వే సంస్థలకు షాక్ ఇచ్చారు ఐదు రాష్ట్రాల జనం. ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు నిజం చెప్పలేదు.. డజన్ల కొద్దీ సర్వేలు చేసిన పత్రికలు, న్యూస్ ఛానళ్లు జనం నాడిని పట్టుకోలేకపోయాయి. ఐదు రాష్ట్రాల్లోనూ సర్వేలకు, ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా తీర్పు ఇచ్చేశారు ప్రజలు.

పశ్చిమబెంగాల్ లో అయితే తృణమూల్ కాంగ్రెస్ – బీజేపీకి నెక్ టూ నెక్ ఫైట్ అన్నారు. రిజల్ట్స్ చూస్తే వన్ సైడ్. బీజేపీ 100 సీట్లు కూడా గెలవలేదు. 292 సీట్లకు గాను మమతా బెనర్జీ 200 సీట్లు సాధించి సంపూర్ణ మెజార్టీ సాధించింది. సర్వేలు అన్నీ కూడా బీజేపీ 140 సీట్లు ఖాయం అని చెప్పాయి.. తీరా 90 దగ్గర ఆగిపోయింది. సర్వేలకు.. వాస్తవానికి 50 సీట్లు తేడా ఉంది..

ఇక తమిళనాడులో అయితే అన్నాడీఎంకే పార్టీకి అత్యధికంగా 50 సీట్లు వస్తే గొప్ప అన్నట్లు.. ప్రతొక్కరూ చెప్పారు.. ఏమైందీ.. ఏకంగా 90 సీట్లలో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుంది. డీఎంకే పార్టీకి 180 సీట్లు కచ్చితంగా వస్తాయని.. ఓ 10 అటూ ఇటూ అన్నారు.. ఏమైందీ.. 150 సీట్లకు అటూ ఇటూ కొట్టుకుంటుంది. అధికారం వచ్చినా.. మెజార్టీ సీట్లు సాధించటంలో బోల్తా పడింది. సర్వేలు అన్నీ తమిళనాడు విషయంలో తప్పాయి..

ఇక కేరళలో లెఫ్ట్ పార్టీ, సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ఎల్ డీఎఫ్ పార్టీ 70 సీట్లలో గెలిచి అధికారంలోకి వస్తుంది అన్నారు.. ఇప్పుడు ఏకంగా 95 సీట్లు సాధించింది. 60 నుంచి 70 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పిన అన్ని సర్వేలు.. ఇప్పుడు మాత్రం అంతకు మించి 25
సీట్లను ఎల్డీఎఫ్ గెలుచుకోవటం విశేషం. అంటే ఇక్కడ కూడా సర్వేలు, పత్రికలు, ఛానల్స్ చెప్పిన అన్ని విషయాలు తప్పు అని నిరూపితం అయ్యింది.

ఇక 126 సీట్లు ఉన్న అసోం రాష్ట్రంలో హంగ్ వచ్చే అవకాశం ఉందంటూ చాలా సర్వేలు చెప్పాయి. ఒకటీ, రెండు ప్రైవేట్ సర్వేలు మాత్రమే బీజేపీదే మళ్లీ అధికారం అన్నాయి. ఇప్పుడు ఏమైందీ.. బీజేపీ కూటమి 75 సీట్లలో గెలిచి స్పష్టమైన ఆధిక్యంతో మళ్లీ అధికారంలోకి వస్తోంది. హంగ్ అన్నోళ్లు అందరూ ఇప్పుడు మాయం అయ్యారు. పత్రికలు, టీవీ ఛానళ్లు ఇచ్చిన సర్వేలు అన్నీ అసోంలో తప్పాయి.. కేవలం రెండు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేలు మాత్రమే నిజం అయ్యాయి.

ఇక పుదుచ్చేరిలో ఉన్నదే 30 సీట్లు.. బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని స్పష్టంగా చెప్పాయి సర్వేలు. 20 సీట్లు తగ్గకుండా బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నారు. ఇంచుమించు అదే జరుగుతుంది. 16 నుంచి 20 సీట్లలో బీజేపీ కూటమి గెలుపుదిశగా వెళుతూ.. 20 ఏళ్ల తర్వాత పుదుచ్చేరిలో అధికారంలోకి రాబోతున్నది.

ఓవరాల్ గా ఐదు రాష్ట్రాల్లోని ఎగ్జిట్ పోల్ సర్వేలకు.. వాస్తవ లెక్కలకు 100 శాతం తేడా కనిపించింది. సర్వేలకు జనం నిజం చెప్పటం లేదని తేలిపోయింది. అదే విధంగా పార్టీలకు కొమ్ముకాస్తూ వార్తలు రాసే పత్రికలు, టీవీ ఛానళ్లను సైతం జనం నమ్మటం లేదని స్పష్టం అయిపోయింది. జనానికి పిచ్చ క్లారిటీ ఉంది.. లేనది ఈ మీడియాకే అని మరోసారి ఐదు రాష్ట్రాల జనం చెప్పేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు