వ్యాక్సిన్ ఏదైనా ఎంట్రీ ఇస్తాం.. స్టూడెంట్స్ కు అమెరికా గుడ్ న్యూస్

వ్యాక్సిన్ ఏదైనా ఎంట్రీ ఇస్తాం.. స్టూడెంట్స్ కు అమెరికా గుడ్ న్యూస్

వ్యాక్సిన్ ఏదైనా ఎంట్రీ ఇస్తాం.. స్టూడెంట్స్ కు అమెరికా గుడ్ న్యూస్

వ్యాక్సిన్ విషయంలో తలెత్తిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాయి ఇతర దేశాలు. భారత్ లో తయారైన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి నో ఎంట్రీ అంటూ అమెరికా, బ్రిటన్ దేశాలు ప్రకటించటంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారు షాక్ అయ్యారు. కొన్ని రోజులుగా వీరికి నో ఎంట్రీ బోర్డు పెట్టింది అమెరికా.

ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా తయారైన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీ, దాని పనితీరుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అనుమతి ఇవ్వలేదు. ఈ పరిణామాలతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్న స్టూడెంట్స్, విదేశాలకు వెళ్లాలనుకున్న వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరిపింది.

ఈ చర్చల ఫలితంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి అనుమతి ఇస్తూ.. అమెరికా 2021, జూన్ 15వ తేదీ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్ ఉంటే ఎంట్రీ ఇస్తామని స్పష్టం చేసింది. కోవీషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏదైనా పర్వాలేదు.. వ్యాక్సిన్ వేయించుకోవటం ముఖ్యం అని వివరించింది.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. ముఖ్యంగా స్టూడెంట్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటికే వేలాది మంది నెల రోజులుగా ఇండియాలోనే ఉండిపోయారు. ఫ్లయిట్ టికెట్లు కన్ఫామ్ అయినా.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ కారణంగా ఆగిపోయారు. వీళ్లందరూ ఇప్పుడు మళ్లీ అమెరికా పయనానికి సిద్ధం అవుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు