నిన్న జగన్ కేంద్రానిదే బాధ్యత అన్నారు.. ఇవాళ మోడీ అదే చెప్పారు.. చాలా ఆశ్చర్యంగా ఉందే..

నిన్న జగన్ కేంద్రానిదే బాధ్యత అన్నారు.. ఇవాళ మోడీ అదే చెప్పారు.. చాలా ఆశ్చర్యంగా ఉందే..

నిన్న జగన్ కేంద్రానిదే బాధ్యత అన్నారు.. ఇవాళ మోడీ అదే చెప్పారు.. చాలా ఆశ్చర్యంగా ఉందే..

అంటే అన్నారంటారు.. రాజకీయ విమర్శలు, ఆరోపణలతో సంబంధం లేకుండా ఓ విషయం మాత్రం ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఢిల్లీలో ఏం జరుగుతుందో సీఎం జగన్ కు ముందే ఎలా తెలుస్తుంది.. మోడీ మనసులోని మాటను మందే ఎలా పసిగడుతున్నారు జగన్ అన్న టాపిక్ నడుస్తుంది.

కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో సరిగ్గా రెండు రోజుల క్రితం సీఎం జగన్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. వ్యాక్సిన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని.. రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించినా ఎవరూ ముందుకు రావటం లేదని.. విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి.. వ్యాక్సిన్లు వేసే బాధ్యత సైతం కేంద్రానిదే అని లేఖ సారాంశం.

జూన్ 4వ తేదీన సీఎం జగన్ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తే.. జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు జానినుద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ.. వ్యాక్సిన్ల బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని స్పష్టం చేశారు. 18 ఏళ్ల పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తామని స్పష్టం చేశారు. 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తుందని.. మరో 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులకు అందిస్తామని వివరించారు. విదేశీ వ్యాక్సిన్లను అనుమతించే విషయంపైనా కేంద్రానికే బాధ్యత అని.. అవసరం మేరకు విదేశీ వ్యాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తామని వివరించారు ప్రధాన మంత్రి మోడీ.

మూడు రోజుల క్రితం సీఎం జగన్.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలోని సారాంశమే.. ఇవాళ ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి చెప్పారు. ఇక్కడే అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతలకు తగ్గట్టుగా.. పరిస్థితులను అంచనా వేసి సీఎం జగన్ ముందస్తు ఆలోచనతో ముందుకెళుతున్నారా లేక.. మోడీ మనస్సులో ఏముందే ముందే పసిగట్టేసి అందుకు తగ్గట్టుగా మాట్లాడేస్తున్నారా అనేది అంతుచిక్కటం లేదు.

కరోనా వైరస్ దేశంలోకి వచ్చిన తర్వాత మొదటి లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సీఎం జగన్ కరోనా, లాక్ డౌన్, అన్ లాక్, వ్యాక్సినేషన్ విషయంలో సీఎం జగన్ చెబుతున్న అన్ని మాటలు.. ఆ తర్వాత ప్రధాన మంత్రి మోడీ నోటి నుంచి వస్తున్నాయి. కరోనాతో సహజీవనం.. పూర్తి లాక్ డౌన్ కు వ్యతిరేకం.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలాంటి అన్ని విషయాల్లోనూ సీఎం జగన్ మాట్లాడటం లేదా లేఖ రాయటం తర్వాత.. అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని మోడీ మాట్లాడుతుంటం విశేషం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు