మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు

banks content--621x414

కరోనా తీవ్రంగా ఉండటంతో ఆరోగ్య రీత్యా బ్యాంకులు కొత్త టైమింగ్స్ ప్రకటించాయి. బ్యాంకులు పని చేసే సమయాన్ని కుదించాయి. ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు పని చేస్తాయని.. కస్టమర్లు గమనించాలని.. బ్యాంకులకు వచ్చే కస్టమర్లు విధిగా డబుల్ మాస్క్ ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని.. శానిటైజర్ ఉపయోగించాలని సూచించాయి బ్యాంకులు.

బ్యాంక్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటించిన బ్యాంకులు.. ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పని చేస్తాయని ప్రకటించాయి. ఏప్రిల్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ టైమింగ్స్ అమల్లో ఉంటాయని.. అవసరాన్ని బట్టి ఈ నిర్ణయాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలిపాయి బ్యాంకులు.

ఆయా రాష్ట్రాల్లో కరోనా ఉధృతి, కేసుల సంఖ్య ఆధారంగా బ్యాంకుల టైమింగ్స్ మార్చుకునే వెసలుబాటును కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు అవకాశం కల్పించింది. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో బ్యాంక్ సమయాలను కుదించాయి అన్ని బ్యాంకులు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ముందస్తు జాగ్రత్తగా మధ్యాహ్నం 2 గంటల వరకు కస్టమర్లకు అవకాశం కల్పిస్తున్నాయి. ఏపీలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాబోయే రోజుల్లో ఇదే విధానం దేశ వ్యాప్తంగా ఉండొచ్చని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు