హైదరాబాద్ పబ్స్ లో బెంగూళూరు డ్రగ్స్ – కీలకంగా మారిన షాడో నేతలు 30శాతం వాట ఆయనదే

once again drugs issue in film industry

బెంగళూరులో డ్రగ్స్ లో పట్టుబడిన నైజీరియన్స్ వెల్లడించిన వివరాలు.. హైదరాబాద్ పబ్స్ ను కుదిపేస్తున్నాయి. నైజీరియన్లు చెప్పిన వివరాల ప్రకారం.. సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్ అనే ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి డ్రగ్స్.. హైదరాబాద్ లోని ఓ బడా పారిశ్రామికవేత్తకు అందించినట్లు సమాచారం.

ఆ పారిశ్రామికవేత్త ఆషామాషీ వ్యక్తి కాదంట.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉన్న చాలా పబ్స్ లో 30 శాతం వాటాదారుడు అంట. ఇటీవల కాలంలో పబ్స్ అన్నింటిలోనూ దండిగా పెట్టుబడి పెట్టి.. తన రాజకీయ పలుకుబడితో విచ్చలవిడిగా.. నాలుగు చేతులా సంపాదించేస్తున్నాడంట. బెంగళూరు డ్రగ్స్ కేసులో.. అనూహ్యంగా.. ఆ పారిశ్రామికవేత్త పేరు బయటకు రావటం సంచలనంగా మారింది.

ఆ పారిశ్రామికవేత్త నిర్వహించే పబ్స్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జోరుగా సాగేదని.. కోట్ల రూపాయలు చేతులు మారేదనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. అధికార అండదండలు ఉన్నాయనే బరితెగింపుతో.. విచ్చలవిడిగా వ్యాపారలు చేశారనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. కన్నడ నిర్మాత శంకర్ గౌడ్ తో కలిసి ఫైనాన్స్ వ్యాపారం కూడా చేశారని.. హైదరాబాద్ కేంద్రంగా సంపాదించిన డబ్బును కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ పెట్టుబడిగా పెట్టారని.. అక్కడ పబ్స్, హోటల్స్ కేంద్రంగా సాగే ఇతర కార్యకలాపాలను హైదరాబాద్ కు విస్తరించారనేది లెటెస్ట్ అప్ డేట్ గా చెబుతున్నారు కొందరు వ్యాపారవేత్తలు.

బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణ లింక్స్ బయటపడటం.. ఇప్పటికే ముగ్గురు వ్యాపారవేత్తలకు నోటీసులు అందించటం.. అందులో అతని పేరు కీలకంగా వినిపించటంతో అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ కలకలం మొదలైంది. ఇక నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా డ్రగ్స్ మాఫియా ఉచ్చులో పడ్డారనే వార్తలతో.. ఎవరా నలుగురు ఎమ్మెల్యేలు.. ఏ పార్టీకి చెందిన వారు.. ఎవరూ ముగ్గురు పారిశ్రామికవేత్తలు.. ఆ ముగ్గురు పారిశ్రామికవేత్తల్లో ఆ పబ్స్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడా.. ఆ షాడో బినామీనేనా అనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతుంది. బెంగళూరు పోలీసుల విచారణకు హాజరైతే మాత్రం మొత్తం వ్యవహారం బయటకు రానుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు