ఎవరీ భారతీసింగ్ – దేశవ్యాప్తంగా ఎందుకింత సంచలనం – గంజాయి కేసులో అరెస్ట్

ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో అని టెన్షన్ పడుతున్నారు. 15 గంటల విచారణ తర్వాత భారతీసింగ్ ఎవరెవరి పేర్లు

భారతీ సింగ్ అరెస్ట్.. గంజాయి తీసుకున్నట్లు ఒప్పుకుంది.. ఆమెను ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు జైల్లో పెట్టారు.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనలో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

భారతీసింగ్ అంటే ఆషామాషీ కాదు.. దేశంలో నెంబర్ వన్ టాక్ షో అయిన కపిల్ శర్మ టాక్ షో ద్వారా పాపులర్ అయ్యింది భారతీసింగ్. బొద్దుగా.. పొట్టిగా, బబ్లీగా ఉంటుందీ అమ్మడు. రెండేళ్ల క్రితం లింబాచియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా గుర్తింపు పొందింది. మొదట భారతీసింగ్ ను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మొదట వీరి ఇంట్లో సోదాలు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఆ తర్వాత భారతీ సింగ్‌, ఆమె భర్త హర్ష్‌ను ఎన్సీబీ ఆఫీస్‌లో 15 గంటలు విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

భారతీసింగ్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.. బుల్లితెరపై ఆమె ఓ సంచలనం. ప్రతి ఇంట్లో ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ టాప్ హీరోస్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఎలా తెలుసా.. అదే స్థాయిలో భారతీసింగ్ కూడా అందరికీ సుపరిచితురాలు.

భారతీసింగ్ అరెస్ట్ తో బుల్లితెర ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. డ్రగ్స్ కేసు ఇంకెంత దూరం వెళుతుందా అని ఆందోళన పడుతున్నారు. ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో అని టెన్షన్ పడుతున్నారు. 15 గంటల విచారణ తర్వాత భారతీసింగ్ ఎవరెవరి పేర్లు చెప్పి ఉంటుంది అనేది చెమటలు పట్టిస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు