దీపావళి మందు కాలుస్తూ.. బీజేపీ ఎంపీ మనవరాలు మృతి

ప్రయాగరాజ్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో చిన్నారిని ఢిల్లీలోని

దీపావళి పండుగ రోజు సాయంత్రం మందులు కాలుస్తూ.. బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి మనవరాలు ఆరేళ్ల చిన్నారి చనిపోవటం షాక్ కు గురి చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ పార్లమెంట్ స్థానం నుంచి ఆమె బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దీపావళి పండుగ రోజు సాయంత్రం ఆరేళ్ల చిన్నారి ఇంటిపైన పిల్లలతో టపాసులు కాలుస్తుంది. సౌండ్ రాని టపాసులు కాస్తుండగా.. చిన్నారి దుస్తులకు మంటలు అంటుకున్నాయి. వెంటనే శరీరం అంతా మంటలు వ్యాపించారు. విషయం తెలిసి చిన్నారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడిన ఎంపీ బహుగుణ జోషి.. ప్రయాగరాజ్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో చిన్నారిని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లో చిన్నారికి ట్రీట్ మెంట్ ప్రారంభించిన వెంటనే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు. 60 శాతం శరీరం కాలిపోయిందని.. బతికించటానికి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు.
దీపావళి పండగ రోజు బీజేపీ ఎంపీ మనవరాలు క్రాకర్స్ నిప్పురవ్వలకు చనిపోవటం బీజేపీ పార్టీలో విషాధాన్ని నింపింది. నేతలు సానుభూతి వ్యక్తం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు