టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా.. జూన్ తర్వాతే ఎగ్జామ్స్.. సంచలన నిర్ణయం

టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా.. జూన్ తర్వాతే ఎగ్జామ్స్.. సంచలన నిర్ణయం

Board Exams for Class 10th cancelled & 12th postponed
Board Exams for Class 10th cancelled & 12th postponed

టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా.. జూన్ తర్వాతే ఎగ్జామ్స్.. సంచలన నిర్ణయం

కరోనా వ్యాప్తి దృష్ట్యా CBSC పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది కేంద్ర విద్యాశాఖ. పరీక్షలన్నీ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన క్రమంలో.. ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

మళ్లీ పరీక్షలు ఎప్పుడు పెట్టేది.. తేదీలు ఏంటీ అనేది జూన్ ఒకటో తేదీన సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది సీబీఎస్ఈ బోర్డు. ఏప్రిల్ 14వ తేదీ ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశం అయ్యింది సీబీఎస్ఈ బోర్డు, కేంద్ర విద్యాశాఖ. గంటపాటు జరిగిన సమీక్ష తర్వాత.. పరీక్షలన్నీ వాయిదా వేస్తూ ప్రకటన చేసింది.

సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ తోపాటు.. మిగతా కాంపిటీషన్ ఎగ్జామ్స్, బోర్డు పరీక్షలను సైతం వాయిదా వేయనున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు ఆయా రాష్ట్రాల్లో. ఇలాంటి సమయంలో పిల్లలకు పరీక్షలు నిర్వహించి.. వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడటం మంచిది కాదని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించటం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి పెరుగుతుందని.. అందుకే సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలు మే 30వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర విద్యాశాఖ.

కేంద్రం నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విధానంతో ముందుకెళ్తాయి అయినే చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్ర పరిధిలోని పది, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తారా.. వాటిని కూడా వాయిదా వేస్తారా అనేది చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు