కరోనా సెంటర్ లో మందు పార్టీ – డిఫరెంట్ గా స్పందించిన నెటిజన్లు

కరోనా సెంటర్ లో మందు పార్టీ - డిఫరెంట్ గా స్పందించిన నెటిజన్లు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే.. వైన్ షాపు దగ్గర, బార్ దగ్గర, పబ్ దగ్గర లేకపోతే మందు తాగితే కరోనా వచ్చిందనే ఒక్క వార్త చూశామా అండీ.. ఈ మాట అంటుంది ఎవరో కాదు..

booze party at Mumbai Covid centre, staffer suspended
booze party at Mumbai Covid centre, staffer suspended

కరోనానా.. తొక్కా.. ఇంకా ఎన్నాళ్లు ఇలా చావాలి.. ఎన్నాళ్లు ఇలా చాకిరీ చేస్తూ ఉండాలి.. వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకున్నారు వాళ్లు.. అంతే.. ఏకంగా కరోనా క్వారంటైన్ సెంటర్ లోనే మందు పార్టీ చేసుకున్నారు. మంచి ఎండల్లో.. చిల్ బీర్ కొట్టి ఎంజాయ్ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కరోనా క్వారంటైన్ సెంటర్ లో సిబ్బంది, ఉద్యోగులు మందు పార్టీ చేసుకోవటాన్ని సహించలేని కొందరు కరోనా బాధితులు.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముందీ.. ఇప్పుడు వాళ్లను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.

మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ ఎక్కవగా ఉండటంతో.. మహారాష్ట్ర రాష్ట్రం మొత్తం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. ముంబై సిటీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కల్యాణ్ – డొంబివాలి ఏరియాలో వైరస్ వ్యాప్తికి కట్టడి కోసం.. స్థానికంగా ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసింది. కరోనా నిర్థారణ అయిన తర్వాత అందర్నీ ఈ సెంటర్ కు తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది వైద్య ఆరోగ్య శాఖ.

మార్చి 28వ తేదీ ఆదివారం కోవిడ్ సెంటర్ అయిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సిబ్బంది చిల్ బీర్ తీసుకొచ్చి తాగారు. మందు పార్టీ చేసుకున్నారు. ఈ విషయాన్ని చూసిన ఓ కరోనా పేషెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో అటూ ఇటూ తిరిగి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల దగ్గరకు చేరింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఆ సిబ్బంది మొత్తాన్ని సస్పెండ్ చేశారు.

అంటే అన్నారు అంటారుగానీ.. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే.. వైన్ షాపు దగ్గర, బార్ దగ్గర, పబ్ దగ్గర లేకపోతే మందు తాగితే కరోనా వచ్చిందనే ఒక్క వార్త చూశామా అండీ.. ఈ మాట అంటుంది ఎవరో కాదు.. నెటిజన్లు. రోగులకు ఇబ్బంది లేకుండా.. కోవిడ్ సెంటర్ ఆవరణలో దూరంగా వారిపాటికి వాళ్లు మందు తాగుతుంటే.. వీళ్లకేంటీ నొప్పి అంటున్నారు నెటిజన్లు.

అనవసరంగా వాళ్లు ఉద్యోగాలు పీకించేశారు అంటూ వీడియో పెట్టినవాళ్లపైనే మండిపడుతున్నారు.. ఎంతైనా నెటిజన్లు చెప్పారంటే ఆలోచించాల్సిందే కదండీ…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు