ఎన్నికల సంఘంతో కేంద్రం చర్చలు.. కొనసాగిద్దామా.. ఆపేద్దామా..

ఎన్నికల సంఘంతో కేంద్రం చర్చలు.. కొనసాగిద్దామా.. ఆపేద్దామా..

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. పశ్చిమబెంగాల్ లో మరో మూడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. మే 2వ తేదీన కౌంటింగ్ ఉంది. దీనికితోడు కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది.

దేశ వ్యాప్తంగా కరోనా బీభత్సంగా ఉండటంతో.. కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు.. ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో కేంద్రం అత్యవసరంగా చర్చించింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నివేదిక కోరింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.. కట్టడి చేసేందుకు ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయటానికి ఉన్న అవకాశాలు ఏంటీ అనే విషయంపై నివేదిక కోరింది.

ఎన్నికల సంఘాలు స్వతంత్ర్యంగా వ్యవహరించేవే అయినా.. ప్రజారోగ్యం, ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈ క్రమంలోనే పరిస్థితిని అర్థం చేసుకుని.. ప్రభుత్వాల బాధ్యతను గుర్తించుకుని.. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేస్తే మంచిదనే అభిప్రాయంలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు.. ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాల నుంచి నివేదిక కోరింది.

See also : లాక్ డౌన్ దిశగా దేశం : సంకేతాలు ఇచ్చేసిన ప్రభుత్వాలు : ముఖ్యమంత్రులకే రక్షణ లేదు

See also : లాక్ డౌన్ దిశగా దేశం : సంకేతాలు ఇచ్చేసిన ప్రభుత్వాలు : ముఖ్యమంత్రులకే రక్షణ లేదు – జనం ప్రిపేర్ అయిపోండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు