Central Government Guidelines: పిల్లలకు కరోనా వస్తే ఏం చెయ్యాలి, కేంద్ర మార్గదర్శలు

Central Government Guidelines: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. గత కొద్దీ రోజులుగా కరోనా కేసుల సంఖ్య లక్షకు మించడం లేదు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేసింది ప్రభుత్వం. దీంతో కరోనా అదుపులోకి వచ్చినట్లే అంటున్నారు నిపుణులు. మరికొందరు మాత్రం థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అది చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

ఎంతమంది చిన్న పిల్లలు కరోనా బారినపడతారు అనేది కూడా చెబుతున్నారు వైద్యులు. కానీ థర్డ్ వేవ్ ప్రభావం ఉండదని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై అప్రమత్తమైంది. ఒకవేళ థర్డ్ వేవ్ విజృంభిస్తే ఏ విధంగా ఎదురుకోవాలి అనే దానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది. చిన్నారుల్లో కరోనా వస్తే ఆ లక్షణాలను ఎలా గురించాలి, చికిత్స ఏవిదంగా అందించాలి అనే దానిపై కేంద్ర ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది.

కరోనా రోజుల ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్న సమయంలో ఇచ్చే రెమిడేసీవీర్ ఇవ్వకుండా ఉండటమే మంచిదని తెలిపింది. యాంటీ మైక్రోబయల్స్ మందులను పిల్లలకు ఇవ్వకూడదని తెలిపింది. ఇక లక్షణాలు తక్కువగా ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్పించకూడదని, ఒకవేళ చేర్పిస్తే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని తెలిపారు. ఇక వైద్యుల కూడా తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెబుతున్నారు. చిన్నారుల్లో లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అశ్రద్ధచేయకుండా టెస్టులు చేయించాలని తెలిపారు. పౌష్ఠిక ఆహారం ఇవ్వడంతో పాటు, కాసేపు వాకింగ్ చేయించాలని సూచిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు