ఆక్సిజన్ ఇచ్చిందనే సెంటిమెంట్ ఏమీ లేదు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదు.. షాక్ ఇచ్చిన కేంద్రం

vizag steel plant

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మూడు నెలలుగా పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో దీక్షలు, ర్యాలీలు, ఉద్యమాలు పక్కన పెట్టిన కార్మిక, ప్రజా సంఘాలు మళ్లీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు.

లాక్ డౌన్ సమయంలో.. దేశవ్యాప్తంగా కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి ప్రతిరోజూ టన్నుల కొద్దీ ఆక్సిజన్ దేశ ప్రజలకు అందించింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. దీని వల్ల వేలాది మంది ప్రాణాలు నిలిచాయి. ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. విశాఖ ఉక్కు లేకపోయి ఉంటే.. వేలాది మంది చనిపోయేవారు.. ప్రభుత్వం ఆధీనంలో ఉండటం వల్ల రాత్రీ పగలు కష్టపడి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచి.. దేశం మొత్తానికి సరఫరా చేయగలిగాం అంటూ ఫ్యాక్టరీ కార్మికులు అంటున్నారు.

ఆక్సిజన్ సరఫరా వల్ల విశాఖ ఉక్కుపై సానుభూతి పెరిగి.. సెంటిమెంట్ కోణంలో ప్రైవేటీకరణకు బ్రేక్ పడుతుందని అందరూ భావిస్తూ వచ్చారు. కేంద్రం తన నిర్ణయాన్ని పున:సమీక్ష చేసుకుంటుందని భావించారు. వాస్తవ పరిస్థితి అలా లేదని కేంద్రం తేల్చిచెప్పింది.

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపేది లేదని తేల్చేసింది. ఆక్సిజన్ ఇచ్చింది.. వేలాది మంది ప్రాణాలను నిలబెట్టింది అనే సెంటిమెంట్ ఏమీ లేదని.. అది బాధ్యత అని.. ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉన్నా.. ఇలాగే ఆక్సిజన్ ఇచ్చేదని అభిప్రాయపడింది కేంద్ర ప్రభుత్వం.

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని.. ఇందులో మరో ఆలోచన లేదని తేల్చేసింది. మొత్తానికి సెంటిమెంట్.. గెంటిమెంట్ మన ప్రధాని మోడీ దగ్గర పని చేయవని కొత్తగా తెలిసేది ఏంటీ.. తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సెంటిమెంట్ కు ఆయింట్ మెంట్ రాసి.. పక్కన పడేసింది మోడీ సర్కార్.. ఆప్టారాల్.. విశాఖ ఉక్కు ఎంత.. అది ఇచ్చిన ఆక్సిజన్ ఎంత అంటున్నారు జనం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు