కరోనా లాక్ డౌన్ 2021 : ఇండియాలో లాక్ డౌన్ విధించి పట్టణాలు ఇవే..

cities that implimented lock down in india

2020 జనవరి 27న కేరళలో తొలి కరోనా కేసు నమోదు అయిన నాటి నుండి ఇప్పటి వరకు దేశంలో అనేక రకాలనై మార్పులను మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,19,262 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. గత వారంలో తగ్గుముఖంలో ఉన్న కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కరోనా సెకండ్ వేవ్ మొదలైందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 25వేలకు పైగా కేసులు నమోదు అయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మహారాష్ట్ర,గుజరాత్ , కేరళ వంటి రాష్ట్రాల్లో మరోసారి కరోనా పంజా విసురుతుండటంతో ప్రతి ఒక్కరిలో ఆందోళన మొదలైంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసినప్పటికి,పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా దేశంలోని కొన్ని పట్టణాల్లో ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ మరోసారి మొదలైంది.

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుండి మార్చి 21 వరకు లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం ఇక్కడ కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇక పూణేలో సైతం మార్చి 31 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రోజు రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ పూణేలో అమలు అవుతుంది.

ఇక ఇదే మహారాష్ట్రలోని నాసిక్ లో సైతం కరోనా లాక్ డౌన్ అమలు అవుతుంది. ఇక్కడ సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7గంటల వరకు పూర్తి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇక థియేటర్లు, హోటళ్లు సైతం 50 శాతం అక్కుపెన్సీ తో ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు మాత్రమే నడుస్తున్నాయి.

ఇక పంజాబ్ లో సైతం నైట్ కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు అధికారులు. లుథియానా , పాటియాలా, మొహాలి , ఫతేఘత్ సాహిబ్ వంటి చోట్ల లాక్ డౌన్ అమలు అవుతుంది.

ఉత్తరాఖండ్ లో సైతం అధికారులు కంటైన్ మెంట్ జోన్లలో కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. కేవలం అత్యవసారలకు మాత్రమే ఇక్కడ అనుమతి ఇస్తున్నారు. నిత్యావసరాల కొనుగోలు కోసం కేవలం ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు.

ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు