రూ.87 వేల కోట్లు ఇచ్చాను – 1600 కోట్లు ఖర్చు పెట్టలేనా.. సింగిల్ చెక్కు ఇస్తా.. వ్యాక్సిన్ ఇచ్చేదెవరు.. తెచ్చేదెవరు.. జగన్ సవాల్..

ap cm jagan and modi

ఏపీలో వ్యాక్సిన్ ప్రక్రియపై టీడీపీ, బీజేపీ, వామపక్షాలు చేస్తున్న రాజకీయంపై సీఎం జగన్.. ఫస్ట్ టైం తన సహజసిద్ధమైన స్టయిల్ లో స్పందించారు. ఛీ.. ఛీ.. ఇలాంటి నీచమైన రాజకీయం చేస్తారనుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల కోసం 45 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారంటూ చంద్రబాబుతోపాటు ఇతర రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలపై మొదటిసారి రాజకీయ నేతగా స్పందించారు.

అధికారంలోకి వచ్చి 22 నెలల్లోనే.. ఒకే ఒక్క బటన్ నొక్కి.. 87 వేల కోట్ల రూపాయలను ప్రజలకు సంక్షేమ పథకాల కింద నగదు రూపంలో అందించాను.. కులం, మతం, ప్రాంతం, రాజకీయం అని చూడకుండా అందరిని అన్ని రకాలుగా ఆదుకున్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఉదయం 5 గంటలకే అవ్వా, తాతల ఇంటికెళ్లి పెన్షన్ వారి చేతుల్లో పెడుతున్నాను.. చంద్రబాబు హయాంలో బాకీ పెట్టిన 17 వేల కోట్ల రూపాయలను సైతం అక్కచెల్లెమ్మలకు అందించాను..

ఇన్ని చేసిన నేను.. 87 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన నేను.. ప్రజల ప్రాణాల కోసం.. కష్టకాలంలో ఆదుకోవటం కోసం.. వ్యాక్సిన్ల కోసం 16 వందల కోట్లు ఖర్చు చేయలేనా అని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించాలని.. ఎవరు ఉదారంగా ఆదుకుంటున్నారు.. ఎవరు ఏం చేస్తున్నారో ఆలోచించాలని కోరారు.

45 కోట్ల రూపాయల చెక్కు ఇప్పటికిప్పుడు ఇస్తాను.. వ్యాక్సిన్ ఇచ్చే కంపెనీ ఏది అని ప్రజలనే ప్రశ్నించారు. దేశంలోని రెండు వ్యాక్సిన్ కంపెనీలకు డబ్బులు ఇస్తానంటే తీసుకోవటం లేదు.. అందుకే గ్లోబల్ టెండర్ల ద్వారా విదేశీ వ్యాక్సిన్లను తీసుకురావటానికి కేంద్రం అనుమతి కోరుతున్నారు.. విదేశీ వ్యాక్సిన్లు వస్తే.. సింగిల్ అమౌంట్ తో.. 1600 కోట్లకు సంబంధించి సింగిల్ చెక్కు ఇస్తాను.. వ్యాక్సిన్ ఇచ్చెదెవరు.. దెచ్చెదెవరు అని ప్రశ్నించారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం విపరీతమైన డిమాండ్ ఉందని.. ఎక్కడ దొరికినా తీసుకోవటానికి.. రోజుకు 10 లక్షల మంది చొప్పున వేయటానికి.. 40 రోజుల్లో ఏపీలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను.. అందుకు సంబంధించిన వ్యవస్థను క్రియేట్ చేశాను అంటున్నారు సీఎం జగన్..

విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీలనే ప్రశ్నిస్తున్నా.. 1600 కోట్ల రూపాయల చెక్కు ఇస్తాను.. వ్యాక్సిన్ తెచ్చేదెవరు అని ప్రశ్నించారు. అన్నీ తెలుసు అని.. ప్రజలు చనిపోతుంటే ఎంతో బాధగా ఉందని.. దేశంలోనే అత్యంత తక్కువ కోవిడ్ మరణాలు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కేరళ తర్వాత ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఉందన్నారు. మరణాల సంఖ్యను తగ్గించే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు సీఎం జగన్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు