మోడీ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ జాతీయ ఉద్యమం

బీజేపీ - కాంగ్రెస్ రెండు పార్టీలు దొందూ దొందే అని.. గతంలో ఎన్నో ఎన్నికల్లో

కేంద్ర ప్రభుత్వంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసి.. పార్టీ నేతలు, కార్యకర్తలకు సందేశం ఇచ్చారు.
డిసెంబర్ 2వ వారంలో సీఎం కేసీఆర్ కాన్ క్లేవ్.. అంటే జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.
బీజేపీ ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ ఏడేళ్లలో తీసుకురాలేదని.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడులు ఉప సంహరించుకుంటూ.. ప్రైవేటీకరణ దిశగా వెళుతుందని.. ఇది దేశానికి మంచిది కాదన్నారు.
ఇప్పటికే 10 పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులతో చర్చించినట్లు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో తెలిపారు.

బీజేపీ – కాంగ్రెస్ రెండు పార్టీలు దొందూ దొందే అని.. గతంలో ఎన్నో ఎన్నికల్లో గెలిచాం.. ఓడాం.. ఒక్క ఓటమితో ఏమీ కాదన్నారు. గెలుపోటములు సర్వసాధారణం అన్నారు.
మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై జాతీయ ఉద్యమానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించటం మాత్రం సంచలనంగా మారింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు