ఎలాంటి ఆమోదం పొందకుండా 1500 కోట్లు పొందిన కార్బివాక్స్ టీకా

హైదరాబాద్ కి చెందిన “బయోలాజికల్ ఈ” సంస్థ తయారు చేస్తున్న ఈ టీకా ఇపుడు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో వుంది . ఈ టీకాకు ఇంత వరకు ఎటువంటి ఆమోదం లభించలేదు. కానీ భారత ప్రభుత్వం ఈ సంస్థకు 30 కోట్ల డోసులు ఆర్డర్ ఇచ్చింది .

ఇందులో భాగంగా 1500 కోట్ల రూపాయల ఎట్ రిస్క్ పెట్టుబడిని కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థలో పెట్టింది. 2020 లో అమెరికా,యూకే వంటి దేశాలు మోడర్న,ఆస్ట్రాజంకా కంపెనీ లలో ఈ తరహా పెట్టుబడులు పెట్టిన భారత ప్రభుత్వం ఈ తరహా పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి.

దీనికి కారణం లేకపోలేదు ఇప్పటికే టీకా తయారు చేస్తున్న భారత్ బయోటెక్ మరియు సీరం సంస్థ పైన తీవ్రమైన ఒత్తిడి వుంది మరియు ఇవి పెరిగిన డిమాండ్ కి సరిపడా ఉత్పత్తిని పెంచుకోలేక పోయాయి.

వీటి మీద ఒత్తిడిని తగ్గించడంతో పాటు టీకా ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతా అనుకున్నట్టు అయితే భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ తరువాత మన దేశం లో అభివృద్ధి చేసి ఉపయోగించనున్న రెండో టీకా కార్బివాక్స్ అవుతుంది మరియు వున్నా వాటికన్నా తక్కువ ధరకి సుమారు 250 రూపాయల లేదా ఇంకా తక్కువకే ఇది లభించనుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు