కరోనా డేంజర్ లోకి దేశం.. కేంద్రం చెప్పిన సత్యం.. ఈ లెక్కలు చూస్తే మీకు నిద్ర పట్టదు

కరోనా డేంజర్ లోకి దేశం.. కేంద్రం చెప్పిన సత్యం.. ఈ లెక్కలు చూస్తే మీకు నిద్ర పట్టదు

corona dangerous period in india
corona dangerous period in india

కరోనా డేంజర్ లోకి దేశం.. కేంద్రం చెప్పిన సత్యం.. ఈ లెక్కలు చూస్తే మీకు నిద్ర పట్టదు

మన దేశంలో కరోనా తీవ్రంగా ఉందని.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 13వ తేదీ ఉగాది రోజున ప్రకటించిన లెక్కలు చూస్తే.. షాకింగ్ గా ఉన్నాయి.

దేశంలో కరోనా పాజిటివ్ రేటు 10 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 13వ తేదీకి.. 24 గంటల్లో లక్షా 61 వేలుగా నమోదు అయ్యింది. ఏప్రిల్ 12వ తేదీ ఒక్క రోజే దేశవ్యాప్తంగా కరోనాతో 875 మంది చనిపోయారు. సెకండ్ వేవ్ లో ఇది హైయ్యస్ట్.

ఇక్కడ ఓ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాది క్రితం లాక్ డౌన్ సమయంలో.. దేశవ్యాప్తంగా ఒక రోజు అత్యధిక మరణాల సంఖ్య 11 వందల 45 మాత్రమే. ఇప్పుడు లాక్ డౌన్ లేదు.. ఆంక్షలు లేవు.. అన్నీ తెరిచే ఉన్నాయి.. ఇప్పుడు ఒక రోజు మరణాల సంఖ్య 875కు చేరింది. అంటే రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

ఏప్రిల్ 13వ తేదీ నాటికి దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 14 లక్షలకు చేరాయి. వైరస్ వ్యాప్తి అనేది 10 శాతంగా ఉంటే.. మరో నెల రోజుల్లోనే 20 శాతానికి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ.

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు భారీగా పంపిణీ చేస్తుంది. ఏప్రిల్ 12వ తేదీ దేశవ్యాప్తంగా 40 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చింది.

ఇప్పటి వరకు 10 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. దేశంలోని 130 కోట్ల మందికి ఇదే విధంగా వ్యాక్సిన్ వేసుకుంటూ వెళితే.. మరో రెండేళ్లు పట్టొచ్చు.. అప్పటికి కరోనాతో ఎంత మందికి వస్తుంది.. ఏ స్థాయిలో దేశాన్ని నాశనం చేస్తుందో అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పుడు ఎటాక్ అవుతున్న కరోనాకు లక్షణాలు బయటపడటం లేదు. సీరియస్ అయిన తర్వాతే బయటపడుతుంది. ఇది చాలా డేంజర్ గా ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటివి ఏమీ లేకుండానే మీ ఒంట్లో కరోనా ఉంటుంది.. బీ అలర్ట్.. బీ సేఫ్..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు