కరోనా మూడో దశలో విజృుభిస్తోంది – సెకండ్ దాటిపోయిందంట దేశంలో

ఆ తర్వాత నెగెటివ్ వచ్చింది. అంటే వీళ్లందరూ సెకండ్ వేవ్ లేదా థర్డ్ వేవ్ కరోనా బారిన పడ్డారా అనే చర్చ

టైటిల్ చూసి షాక్ అయ్యారా.. అవును ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉంది అని అనుకుంటన్నాం.. భారతదేశంలో ఇంకా రెండో దశ రాలేదు.. డిసెంబర్ – ఫిబ్రవరి మధ్య సెకండ్ వేవ్ ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు.. కానీ వాస్తవంగా అయితే సెకండ్ వేవ్ వచ్చి పోయిందంట.. ఇప్పుడు భారతదేశంలో థర్డ్ వేవ్.. మూడో దశ విజృుంభణ కొనసాగుతుంది.

ఈ మాటలు అల్లాటప్పా అన్నవారు కాదు.. ఢిల్లీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేస్తున్న సత్యేంద్ర జైన్ అన్నారు. అది కూడా కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రతి ఒక్కరూ ఆయన మాటలపైనే ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. వారిలో రాజశేఖర్ తోపాటు మరికొందరు ఉన్నారు. చిరంజీవికి మొదట పాజిటివ్ వచ్చినా ఆ తర్వాత నెగెటివ్ వచ్చింది. అంటే వీళ్లందరూ సెకండ్ వేవ్ లేదా థర్డ్ వేవ్ కరోనా బారిన పడ్డారా అనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గినా.. జనంలో కరోనా భయం లేకపోయినా.. పర్వాలేదు కానీ.. అందరూ జాగ్రత్తగా ఉండాలని మాత్రం పదేపదే చెబుతున్నారు. విధిగా మాస్క్ పెట్టుకోవాలని.. ఇన్నాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో వాటిని ఫాలో కావాలని సూచిస్తున్నారు.

దేశంలో రెండో దశ అనేది మనకు తెలియకుండానే పోయిందా అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి. మూడో దశలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు