అది కుంభ మేళా కాదు.. కరోనా మేళా.. 130 మంది సాధువులకు పాజిటివ్.. యూపీలో విలయతాండవం

అది కుంభ మేళా కాదు.. కరోనా మేళా.. 130 మంది సాధువులకు పాజిటివ్.. యూపీలో విలయతాండవం

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కరోనా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కు పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలోనే.. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నిర్వహించిన కుంభమేళా.. ఇప్పుడు కరోనా మేళగా మారింది.

ఐదు రోజుల్లోనే 20 లక్షల మంది గంగానదిలో స్నానం చేశారు. వచ్చి వెళ్లిన వారి సంగతి ఏమోగానీ.. అక్కడే ఉంటున్న 200 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 50 మంది వరకు సాధువులు ఉన్నారు. వీరు చికిత్స తీసుకోవటానికి కూడా నిరాకరిస్తున్నారు. మాకు కరోనా రాదు.. వచ్చినా తగ్గిపోతుంది.. దేవుడి లీల ఇది అంటుున్నారు సాధువులు.

కరోనాను లెక్క చేయకుండా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు కుంభమేళాకు. కిక్కిరిసిన జనంతో స్నానాలు చేస్తున్నారు. ఇప్పటికే 50 మంది సాధువులు కరోనాకు ట్రీట్ మెంట్ తీసుకుంటుంటే.. మరో 150 మంది పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు. స్నానం చేసిన వెళ్లిన వారిలో ఇంకెంత మందికి కరోనా వచ్చిందో అనేది ఇప్పుడు భయపెడుతుంది.

ఈ క్రమంలోనే కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారు.. వారం రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలని ఆదేశించింది. వాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

మిగతా రాష్ట్రాలు సైతం ఈ విషయంలో అప్రమత్తం అయ్యాయి. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. ఐసోలేషన్ లో ఉండాలని స్పష్టం చేసింది.

కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్నా.. కుంభమేళాను కుదించే ఆలోచన లేదని.. 21 రోజులు నిర్వహించి తీరతాం అని ప్రకటించారు సాధువులు, హిందూ పరిరక్షణ సంఘాలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు