ట్రంప్ తరహాలోనే ముందుకెళుతున్న మోడీ.. 4 కాదు.. 20 లక్షలు అయినా లాక్ డౌన్ లేదు..

ట్రంప్ తరహాలోనే ముందుకెళుతున్న మోడీ.. 4 కాదు.. 20 లక్షలు అయినా లాక్ డౌన్ లేదు..

modi and trump
modi and trump

ట్రంప్ తరహాలోనే ముందుకెళుతున్న మోడీ.. 4 కాదు.. 20 లక్షలు అయినా లాక్ డౌన్ లేదు..

గురివింద కింద నలుపు దానికి తెలియదు అంట.. మొన్నటి వరకు కరోనా ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశాలు అన్నీ ఇప్పుడు మనకు చెప్పటం మొదలెట్టాయి.. కరోనా కట్టడి అలా.. ఇలా అంటూ సుద్దులు చెబుతున్నాయి ప్రపంచ దేశాలు. అంతేనా.. ప్రతి ఒక్కరికీ లోకువ అన్నట్లు.. చివరకు అమెరికా చీఫ్ మెడికల్ సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫాచీ కూడా మాట్లాడుతూ.. భారత్ కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలంటూ హితబోధ చేస్తున్నారు.

అమెరికాలో అసలు లాక్ డౌన్ పెట్టారా.. రోజుకు 10 లక్షల కేసులు వచ్చినప్పుడు కూడా జనం రోడ్లపై తిరిగారు.. రోజుకు 10 వేల మంది చనిపోయిన రోజు సైతం లాక్ డౌన్ పెట్టలేదు.. లాక్ డౌన్ పెట్టేది లేదని అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తెగేసి చెప్పారు.. లాక్ డౌన్ వల్ల పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేస్తూ.. లాక్ డౌన్ పెట్టకుండానే కరోనాను కంట్రోల్ చేశారు.

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదయిన సమయంలోనూ లాక్ డౌన్ పెట్టని అమెరికా.. ఇప్పుడు మాత్రం భారత్ లో లాక్ డౌన్ పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తుంది.. ఎందుకిలా.. అమెరికాలో ఒకలా.. ఇండియాలో ఒకలా ఎందుకు మాట్లాడుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారతదేశంలో ఏప్రిల్ 30వ తేదీ ఒక్క రోజే 4 లక్షల 20 వేల పాజిటివ్ కేసులు వస్తే.. 3 వేల 500 మంది చనిపోయారు. అయినా కేంద్రం లాక్ డౌన్ దిశగా అడుగులు వేయటం లేదు. రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసింది. గత ఏడాది పెట్టిన లాక్ డౌన్ వల్ల కరోనా కట్టడి కాకపోగా.. ఆర్థిక సంక్షోభం వచ్చింది. కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. ఈ పరిణామాలను అంచనా వేసిన మోడీ.. ఈసారి మాత్రం అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్ తరహాలో ముందుకెళుతున్నారు. లాక్ డౌన్ పెట్టేది లేదు.. కరోనాతో సహజీవనం చేయాల్సిందే.. పోరాడాల్సిందే అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ పెడితే.. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అంటున్నారు. ఆ తర్వాత వైద్యానికి ఖర్చు చేయటానికి సైతం డబ్బులు ఉండవని అంటోంది కేంద్రం.

కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదని.. ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లాలని చెబుతోంది కేంద్రం. రాష్ట్రాలకు నిధులు విరివిగా ఇస్తే లాక్ డౌన్ పెడతామని చెబుతున్నారు రాష్ట్రాల సీఎంలు. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయటం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లాక్ డౌన్ విధించటానికి భయపడుతున్నారు. ఏడాది కాలం ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతున్న సమయంలో.. లాక్ డౌన్ విధిస్తే.. అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నాయి రాష్ట్రాలు.

సో.. దేశంలో లాక్ డౌన్ లేదని ప్రధాని మోడీ చెప్పేశారు.. నాలుగు లక్షలు కాదు కదా.. 40 లక్షల కేసులు వచ్చినా లాక్ డౌన్ పెట్టే ఆలోచన చేయటం లేదు మోడీ.. కరోనాపై పోరాటం మాత్రమే చేస్తారు.. లాక్ డౌన్ పెట్టరని ప్రజలు గమనించాలి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు