ఈ 10 రాష్ట్రాల్లో కరోనా బీభత్సం.. హెచ్చరించిన కేంద్రం : డేంజర్ లో జోన్ లోకి తెలుగు రాష్ట్రాలు..

covid cases in india are at worest hit

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిపై కేంద్రం అత్యవసరంగా సమావేశం అయ్యింది. ప్రధాని మోడీతోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని సమీక్షించి.. అత్యధికంగా కరోనా కేసులు ఉన్న 10 రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ లెక్కల ప్రకారం.. ఆ పది రాష్ట్రాల్లో పరిస్థితిని చూద్దాం.

మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధికంగా మహారాష్ట్ర 6 లక్షల 46 వేల 563 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక లక్షా 70 వేల 59 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 61 వేలు, మధ్యప్రదేశ్ 63 వేల 889, చత్తీస్ ఘడ్ లో లక్షా 04 వేలు, తమిళనాడు రాష్ట్రంలో 65 వేల 635,
కేరళ రాష్ట్రంలో 80 వేల 341 యాక్టివ్ ఉన్న ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో 55 వేల 398, రాజస్తాన్ రాష్ట్రంలో 53 వేల 813 కేసులు ఉన్నాయి. ఈ 10 రాష్ట్రాల్లో పరిస్థితి దాదాపు చేయిదాటిపోయిందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 18వ తేదీ విడుదల చేసిన కరోనా బులిటెన్ లో 6 వేల 583 కేసులు నమోదు అయితే.. 22 మంది చనిపోయారు. ఏపీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేలుగా ఉంది. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు చనిపోయారు. ఇక తెలంగాణలో ఒక్క రోజులోనే 5 వేల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 16గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుండటంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నా.. లక్షణాలు లేకుండా విస్తరిస్తున్న కరోనా వైరస్ తో.. రాబోయే రోజులు భయానకంగా ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకోవటమే ఉత్తమంగా అని సూచిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు