ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ భారత్ లో – అసలు రహస్యం ఇదే తెలుసుకోండి

కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కొరకు మాత్రమే అనుమతులు పొందింది. అంటే వాడకందార్లు ఎవరైనా, తమ సొంత రిస్క్ మీదనే వ్యాక్సిన్ తీసుకుంటునట్లుగా క్లినికల్ ట్రయల్ ఫారం మీద సంతకం...

covid vaacine in india to start on january 16th

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ శనివారం నాటి నుండి ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందుబాటులోకి రానుంది. వాక్సిన్ కి సంబంధించిన అన్ని రకాల అనుమతులను కేంద్రం ఇవ్వడంతో, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దాదాపుగా పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ను జనవరి 17 న ప్రారంభిస్తారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో దేశవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లు మొదటి రోజు వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ గా మొదలుకానున్న ఈ డ్రైవ్ గురించి ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. అవి ఏంటంటే..?

కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కొరకు మాత్రమే అనుమతులు పొందింది. అంటే వాడకందార్లు ఎవరైనా, తమ సొంత రిస్క్ మీదనే వ్యాక్సిన్ తీసుకుంటునట్లుగా క్లినికల్ ట్రయల్ ఫారం మీద సంతకం చేయాలి. సంబంధిత ఫారం మీద సంతకం చేయకపోతే అధికారులు వ్యాక్సిన్ ఇవ్వరు.

ఈ వ్యాక్సిన్ తీసుకునే వారికి ముందుగానే మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ లో వారు వెళ్లాల్సిన కేంద్రం దాని వివరాలు ఉంటాయి. అలాగే సంబంధిత వ్యక్తి ఏ సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లాలనే సమాచారం మెసేజ్ లో స్పష్టంగా ఉంటుంది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 16.5 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను వ్యాక్సినేషన్ కేంద్రాలకు అధికారులు తరలించారు. మొదటిరోజే కనీసం 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.

దేశంలో ప్రారంభం అయిన అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మొదటి రోజు కేవలం 100 మందికి మాత్రమే టీకా వేస్తారు. రోజులు గడిచే కొద్ది ఈ సంఖ్యను పెంచుకుంటూ పోతారు.

మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు అవుతుంది. ప్రధాని ప్రసంగం ముగిసిన అనంతరం మొదటి వ్యాక్సిన్ ఎవరికైనా ఇస్తారా లేక ప్రధాని మోదీ స్వయంగా తానే వ్యాక్సిన్ తీసుకుంటారా అనే విషయం తేలియాల్సి ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు